హైదరాబాద్: ఓటు హక్కును వినియోగించుకోకపోతే  నేతలపై  ఫిర్యాదు చేసే హక్కు లేదని సినీ నటుడు జూనియర్ ఎన్టీఆర్ అభిప్రాయపడ్డారు.

జూబ్లీహిల్స్  అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో ఓబుల్ రెడ్డి స్కూల్‌లో సినీ నటుడు జూనియర్ ఎన్టీఆర్  శుక్రవారం నాడు  తల్లి, భార్యతో కలిసి ఓటు హక్కును  వినియోగించుకొన్నారు.

జూనియర్ ఎన్టీఆర్  క్యూ లైన్లో నిల్చుని ఓటు హక్కును వినియోగించుకొన్నారు. ఓటు హక్కును  ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలి. రాజ్యాంగం కల్పించిన హక్కును ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఓటు హక్కును వినియోగించుకోకపోతే  ఫిర్యాదు చేసే హక్కు కూడ లేదని జూనియర్ ఎన్టీఆర్ అభిప్రాయపడ్డారు.

ఓటు వేయండి చెప్పడం కంటే  మనం ఓటు  వేయాలనే  కోరికతో వచ్చి  ఓటు వేయడం  మంచిదని జూనియర్  చెప్పారు. పోలింగ్ బూత్  వద్ద  ఇంతకంటే తాను ఎక్కువగా మాట్లాడలేనని చెప్పారు.

"