హైదరాబాద్: తెలంగాణలో సమ్మెబాట పట్టిన జూనియర్ వైద్యలు ఎట్టకేలకు సమ్మె విరమించారు. అసిస్టెంట్ ప్రొఫెసర్ల కాళీలను భర్తీ చేయాలని, కాంట్రాక్టు వైద్యుల నియామకాన్ని పూర్తిగా రద్దు చేయాలని, బోధనాస్పత్రుల్లోప్రొఫెసర్లు పదవీవిరమణ వయస్సు పెంపును నిరసిస్తూ జూడాలు ఆందోళన బాటపట్టారు. 

సమ్మె వల్ల ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉన్న నేపథ్యంలో వైద్యఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ జూడాలను చర్చలకు ఆహ్వానించారు. చర్చలు ఫలప్రదం కావడంతో సమ్మె విరమిస్తున్నట్లు ప్రకటించారు జూనియర్ డాక్టర్లు.

తమ డిమాండ్లకు సానుకూలంగా మంత్రి ఈటల రాజేందర్  స్పందించడంతో సమ్మె విరమిస్తున్నట్టు జూనియర్ వైద్యుల సంఘం అధ్యక్షుడు విజేందర్ స్పష్టం చేశారు. వయోపరిమితి పెంపు ఆర్డినెన్స్ జారీ చేసిన నేపథ్యంలో జూడాల అభిప్రాయాలను కూడా పరిగణలోకి తీసుకుంటానని మంత్రి హామీ ఇచ్చినట్లు జూడాలు తెలిపారు.