జూబ్లీహిల్స్ గ్యాంగ్ రేపు కేసులో నిందితులుగా ఉన్న మైనర్లు కొట్టుకున్నట్టుగా తెలుస్తోంది. టీవీ చానెళ్ల కథనం ప్రకారం.. జువైనల్‌ హోంలో ఐదుగురు మైనర్లు ప్లేట‌తో దాడి చేసుకున్నారు. కార్పొరేటర్ కుమారుడు టార్గెట్‌గా ఈ దాడి జరిగినట్టుగా తెలుస్తోంది. 

జూబ్లీహిల్స్ గ్యాంగ్ రేపు కేసులో నిందితులుగా ఉన్న మైనర్లు కొట్టుకున్నట్టుగా తెలుస్తోంది. టీవీ చానెళ్ల కథనం ప్రకారం.. జువైనల్‌ హోంలో ఐదుగురు మైనర్లు ప్లేట‌తో దాడి చేసుకున్నారు. కార్పొరేటర్ కుమారుడు టార్గెట్‌గా ఈ దాడి జరిగినట్టుగా తెలుస్తోంది. అతన్ని టార్గెట్ చేసుకుని మిగిలిన నలుగురు దాడి చేశారు. చివరకు పోలీసుల జోక్యంతో.. ఈ వివాదం సద్దుమణిగినట్టుగా సమాచారం. అయితే దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం రేపిన ఈ కేసులో ఏ పరిణామం చోటుచేసుకున్న.. తీవ్ర చర్చనీయాంశంగా మారుతోంది. 

ఇక, ఈ కేసులో ప్రధాన నిందితుడు సాదుద్దీన్ మాలిక్ కస్టడీ నిన్నటితో ముగిసింది. కోర్టు అనుమతితో పోలీసులు నాలుగు రోజుల పాటు సాదుద్దీన్‌ను విచారించారు. కస్టడీ ముగియడంతో ఈరోజు ఉదయం సాదుద్దీన్‌ను పోలీసులు నాంపల్లి కోర్టులో హాజరుపర్చారు. ఈ సందర్భంగా కోర్టు.. అతడికి 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. అనంతరం నిందితుడిని చంచల్‌గూడ జైలుకు తరలించారు. 

ఇదిలా ఉంటే.. ఈ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. బాలికపై సామూహిక అత్యాచారం ముందస్తు ప్రణాళిక ప్రకారమే జరిగిందని పోలీసులు ప్రాథమిక ఆధారాలు సేకరించినట్టుగా తెలుస్తోంది. నలుగురు మైనర్లు, ఒక మేజర్ ప్రణాళిక ప్రకారమే నేరానికి పాల్పడ్డారని హైదరాబాద్ పోలీసులు వర్గాలను ఉటంకిస్తూ టైమ్స్ ఆఫ్ ఇండియా రిపోర్ట్ చేసింది. నిందితులు వినియోగించిన ఇన్నోవా, బెంజ్ కార్లలో పోలీసులు కండోమ్‌లు గుర్తించినట్టుగా ఆ వర్గాలు తెలిపాయి. బాలికపై అఘాయిత్యానికి పాల్పడిన సమయంలో నిందితులు కండోమ్‌లు వినియోగించినట్టుగా పోలీసులు గుర్తించారు. అయితే వారు కండోమ్‌లను ఎక్కడి నుంచి పొందారో తెలుసుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని ఓ పోలీసు అధికారి చెప్పినట్టుగా టైమ్స్ ఆఫ్ ఇండియా పేర్కొంది. 

ఇక, ఈ కేసులో ఆరుగురు నిందితులు ఉండగా.. అందులో ఐదుగురు మైనర్లు, ఒక మేజర్ ఉన్నారు. అయితే ఒక మైనర్ మాత్రం బాలికపై అత్యాచారానికి పాల్పడలేదని పోలీసులు చెప్పారు. ఈ క్రమంలోనే నిందితులను కోర్టు అనుమతితో కస్టడీలోకి తీసుకున్న పోలీసులు విచారణ జరుపుగుతన్నారు. ఆదివారం రోజున ఆరుగురు నిందితులతో పోలీసులు రీకన్‌స్ట్రక్షన్ చేశారు. నిందితులను నేరం జరిగిన రోడ్డు నెంబర్ 44కు తీసుకెళ్లారు. నేరానికి సంబంధించిన వివరాలను సేకరిస్తున్నారు.ఇక, బాధితురాలు స్నేహపూర్వక వైఖరిని ఉపయోగించుకుని లైంగిక దాడి చేసినట్టుగా నిందితులు అంగీకరించినట్లు తెలిసింది. 

అయితే నిందితులు ఇచ్చిన వాంగ్మూలాల్లో కొన్ని తేడాలున్నాయని పోలీసు వర్గాలు తెలిపాయి. కాల్ రికార్డుల ఆధారంగా మేము వారిని మళ్లీ విచారించాల్సిన అవసరం ఉందని ఆ వర్గా పేర్కొన్నాయి. నిందితులందరి కాల్ డేటా రికార్డ్స్‌ను క్రోడికరించిన పోలీసులు.. సోమవారం వాటి ఆధారంగా మరింత లోతుగా ప్రశ్నించనున్నారు.