బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ను (Bandi Sanjay)  ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఫోన్ ద్వారా పరామర్శించారు. బండి సంజయ్‌కు జేపీ నడ్డా (JP Nadda) ఫోన్ చేయగా.. బండి సంజయ్ పోలీస్ కస్టడీలో ఉన్న విషయాన్ని ఆయన కార్యాలయ సిబ్బంది తెలిపారు.

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ను (Bandi Sanjay) ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఫోన్ ద్వారా పరామర్శించారు. బండి సంజయ్‌కు జేపీ నడ్డా (JP Nadda) ఫోన్ చేయగా.. బండి సంజయ్ పోలీస్ కస్టడీలో ఉన్న విషయాన్ని ఆయన కార్యాలయ సిబ్బంది తెలిపారు. ఈ సందర్భంగా ఉద్యోగులు, ఉపాధ్యాయుల పక్షాన బండి సంజయ్ చేస్తున్న పోరాటం భేష్ అని జేపీ నడ్డా మెచ్చుకున్నారు. కేసుల గురించి భయపడాల్సి అవసరం లేదన్నారు. బండి సంజయ్ వెనక జాతీయ నాయకత్వం ఉందని తెలిపారు. ఈ విషయాన్ని తన మాటగా సంజయ్‌కు చెప్పాలని అన్నారు. పోరాటంలో మరింత ముందుకెళ్లాలని సూచించారు.

మరోవైపు బండి సంజయ్ చేస్తున్న దీక్షను భగ్నం చేయడంపై జేపీ నడ్డా ఆగ్రహం వ్యక్తం చేశారు. కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా తన కార్యాలయంలో దీక్ష చేస్తున్న బండి సంజయ్‌‌ అరెస్ట్ చేయడం, లాఠీ చార్జి చేయడం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమేనని విమర్శించారు. ఈ అమానుష తీరును ఖండించదగినదని చెప్పారు. ఈ దుర్మార్గపు ప్రయత్నాన్ని తాము తీవ్రంగా ఖండిస్తున్నట్టుగా చెప్పారు. వినాశకాలే విపరీత బుద్ది అనేలా కేసీఆర్ సర్కార్ వ్యవహరిస్తోందని అన్నారు. ఉపాధ్యాయుల తరఫున బీజేపీ పోరాటం కొనసాగుతుందన్నారు. సత్యం కోసం పోరాడతామని చెప్పారు. కేసీఆర్ సర్కార్‌పై న్యాయ పోరాటం కొనసాగిస్తామని అన్నారు. 

Also Read: Bandi Sanjayపై రెండు కేసులు నమోదు చేసిన పోలీసులు.. కరీంనగర్‌లో టెన్షన్


తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన 317 జీవోకు (GO 317) నిరసనగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ (Bandi Sanjay).. కరీంనగర్‌లోని (Karimnagar) తన ఎంపీ క్యాంప్‌ కార్యాలయంలో చేపట్టిన జాగరణ దీక్ష చేపట్టారు. పోలీసులు తలుపులు పగులగొట్టి.. బండి సంజయ్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలో పోలీసులు, బీజేపీ కార్యకర్తల మధ్య.. తీవ్ర వాగ్వాదం, తోపులాట చోటుచేసుకున్నాయి. ఈ క్రమంలోనే బీజేపీ కార్యకర్తలపై పోలీసులు లాఠీఛార్జి చేశారు. ఈ రకంగా బండి సంజయ్ దీక్షను పోలీసులు ఆదివారం రాత్రి భగ్నం చేశారు. అనంతరం ఆయనను మానుకొండూరు పోలీసు స్టేషన్‌కు తరిలించారు. అయితే ఈ ఉదయం కరీంనగర్‌లోని పోలీస్ ట్రైనింగ్ సెంటర్‌కు(పీటీసీ) బండి సంజయ్‌ను తీసుకొచ్చారు. 

Scroll to load tweet…
Scroll to load tweet…

అయితే ఈ క్రమంలోనే కరీంనగర్ పోలీసులు.. నాన్ బెయిలబుల్ కేసులు (non bailable cases on bandi sanjay) నమోదుచేసారు. కోవిడ్ నిబంధనలు ఉల్లంఘించిన బండి సంజయ్ తో పాటు 16 మందిపై కేసులు నమోదు చేసినట్లు కరీంనగర్ కమీషనర్ సత్యనారాయణ (cp satyanarayana) తెలిపారు. మొత్తంగా 70 మంది బీజేపీ నాయకులు (bjp leaders), కార్యకర్తలపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లు సీపీ వెల్లడించారు.