ఉద్యోగాల ఖాళీలు... హైదరాబాద్ నుంచి ఢిల్లీ దాకా ఒకటే జబ్బు

job vacancies alarming at all levels from Telangana teachers to all India services
Highlights

1951 నుంచి ఆల్ ఇండియా సర్వీసెస్ లలో పెద్ద సంఖ్యలో ఖాళీలు. ఏదో ఒక సాకుతో రిక్రూట్ మెంట్ వాయిదా

రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న ఉద్యోగాల ఖాళీలను ప్రభుత్వాలు నింపడం లేదని నిరుద్యోగులంతా గొడవ చేస్తుంటారు.

 

ఈ గొడవ తెలంగాణాలో మరీ ఎక్కువగా ఉంది. అన్ని రాజకీయ పార్టీలు, ‘ప్రభుత్వంలో ఖాళీలెన్ని ఉన్నాయ్, అన్ని ఖాళీలను వెంటనే నింపండి, నింపేందుకు పోటీ పరీక్షల క్యాలెండర్ ప్రకటించండి, అని రోజూగొడవచేస్తున్నాయి.

 

ఆంధ్రో పోరగాళ్లెపుడూ ఇలా ఉద్యోగాల కోసం గొంతెత్తరు. రోడ్డెక్కడానికి  వాళ్లు సిగ్గు పడతారు.

 

ఇలా ఉన్న ఖాళీలను నింపకపోవడమనే జబ్బు హైదరాబాద్, అమరావతిలోనే కాదు, దేశ రాజధానిలో  కూడా ఉంది. ఎలాగో చూడండి.

 

ప్రభుత్వాలను నడపాల్సిన ఇండియన్అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ (ఐఎఎస్)లో దేశ వ్యాపితంగా 1470 ఖాళీలున్నాయి. రాష్ట్రాలలో  ఐఎఎస్  ఆఫీసర్ల కొరత తీవ్రంగా ఉన్నా సెంటర్ ఈ ఖాళీలను నింపడం లేదు. దీనితో పరిపాలనకుంటుపడుతూ ఉందని అందరికీ  తెలుసు. తగినంత మంది అనుభవజ్ఞులయిన ఐఎఎస్ లు లేక తెలంగాణాలో కొత్త జిల్లాలకు జూనియర్లనే కలెక్టర్లుగా నియమించారు.

 

ఈ ఐఎఎస్ ల ఖాళీల గురించిన సమాచారం  న్యాయశాఖ పార్లమెంటరీ కమిటీ అధ్యయనంలో వెల్లడయింది. ఈ నివేదికను ఈ కమిటీ నిన్న పార్లమెంటుకు సమర్పించింది. ఈ పరిస్థితి 1951 నుంచి కొనసాగుతూ ఉందట. ఇపుడిది ముదిరింది. దేశానికి మొత్తం 6396 మంది ఐఎఎస్ లు అవసరమయితే అందుబాటులో ఉండేది కేవలం 4926 మందే.అంటే 77 శాతం.

 

దీనికి ప్రభుత్వ సాకు ఏమిటో తెలుసా... అందరిని రిక్రూట్ చేస్తే వారికి శిక్షణ ఇచ్చే వసతి లేదు. అందుకనీ పరిపాలన స్తంభింపచేసుకుంటారా అనేది ప్రశ్న.

 

ఇంత పెద్ద భారత దేశంలో యేటా 180 మంది ఐఎఎస్ లకంటే ఎక్కువ మందికి శిక్షణ ఇవ్వలేరట.

  

loader