యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ చైర్ పర్సన్ గా తెలంగాణ రాష్ట్రం.. నల్గొండ జిల్లాకు చెందిన ప్రొఫెసర్ మామిడాల జగదీష్ కుమార్ నియమితులయ్యారు. ఇప్పటివరకు యూజీసీ చైర్మన్ గా నియమితులైన మూడో తెలుగు వ్యక్తి జగదీష్ కుమార్. 

నల్గొండ : University Grants Commission (యూజీసీ)గా ప్రొఫెసర్ 
Mamidala Jagadish Kumar నియమితులయ్యారు. ఐదేళ్లపాటు ఈ పదవిలో ఆయన కొనసాగనున్నారు. కమిషన్ చైర్మన్ గా పనిచేసిన ప్రొఫెసర్ డిపి సింగ్ పదవీకాలం ముగియడంతో డిసెంబర్ 7న పదవీ విరమణ చేశారు. అప్పటి నుంచి ఖాళీగా ఉన్న పోస్ట్ కు ప్రకటన ఇవ్వడంతో, 55 మంది దరఖాస్తు చేసుకోగా జగదీష్ కుమార్ ఎంపికయ్యారు. UGC చైర్మన్ గా నియమితులైన మూడో తెలుగు వ్యక్తి జగదీష్ కుమార్. 1961లో డాక్టర్ వాసిరెడ్డి శ్రీకృష్ణ, 1991 నుంచి 1995 వరకు జి.రామిరెడ్డి యూజీసీ చైర్మన్లుగా పని చేయగా, ఇప్పుడు ప్రొఫెసర్ జగదీష్ కుమార్ నియమితులయ్యారు. 

60 ఏళ్ల జగదీష్ కుమార్ ప్రస్తుతం JNU Vice Chancellorగా పనిచేస్తున్నారు. వీసీగా గతేడాదే పదవీకాలం ముగిసినా ఆయనను కొనసాగించారు. Jnuలో ఆయన వీసీగా ఉన్నప్పుడు 2016లో విద్యార్థులపై దేశద్రోహం కేసులు నమోదు కావడం, Afzal Guru ఉరికి వ్యతిరేకంగా విద్యార్థులు నిర్వహించదలచిన కార్యక్రమాన్ని వీసీ వద్దనడం, విద్యార్థులు వీసీ కార్యాలయానికి తాళాలు వేయడం, 2019లో జరిగిన స్నాతకోత్సవ వేదికపై దాదాపు ఆరు గంటలపాటు మానవ వనరుల శాఖ మంత్రిని నిర్బంధించడం వంటి అనేక వివాదాస్పద సంఘటనలు జరిగాయి.

నల్గొండ వాసి..
తెలుగువాడైన జగదీష్ కుమార్ స్వస్థలం నల్లగొండ జిల్లా తిప్పర్తి మండలం మామిడాల గ్రామం. పాఠశాల విద్యను స్వగ్రామంలో, ఏడో తరగతి నుంచి ఇంటర్ వరకు మిర్యాలగూడలో చదివారు. డిగ్రీతోపాటు ఎంఎస్సీ ఎలక్ట్రానిక్స్ హైదరాబాదులో చదివారు. ఆ తర్వాత ఐఐటీ మద్రాస్లో ఎం.ఎస్, పీహెచ్డీ పూర్తి చేశారు. ఆ తర్వాత పోస్ట్ డాక్టోరల్ రీసెర్చ్ కోసం కెనడా వెళ్లి 1994లో స్వదేశానికి తిరిగి వచ్చారు. 1995లో ఢిల్లీ ఐఐటి ప్రొఫెసర్ గా ఉద్యోగంలో చేరారు. 2013లో ఐఐటీ ఢిల్లీ నుంచి ‘అవార్డు ఫర్ ఎక్స్లెన్స్ ఇన్ టీచింగ్’ అందుకున్నారు.

ఎలక్ట్రానిక్ ఇంజనీరింగ్లో నిష్ణాతుడైన ఆయన 2016 ఢిల్లీ Jnu వైస్ ఛాన్స్ లర్ గా నియమితులయ్యారు. ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వ సాంస్కృతిక మంత్రిత్వ శాఖలోని నేషనల్ కౌన్సిల్ ఆఫ్ సైన్స్ మ్యూజియమ్స్ పాలక మండలి చైర్మన్ గా, నేషనల్ అసెస్మెంట్ అండ్ అక్రెడిటేషన్ కౌన్సిల్ (న్యాక్) ఎగ్జిక్యూటివ్ కమిటీ చైర్మన్ గా, ugc, టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) సభ్యునిగా ఉన్నారు.

ఇండియన్ నేషనల్ అకాడమీ ఆఫ్ ఇంజినీరింగ్, ది నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్, ది ఇన్ స్టిట్యూషన్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ టెలీకమ్యూనికేషన్ ఇంజినీర్స్ ఫెలో అందుకున్నారు. సెమీ కండక్టర్ డివైస్ డిజైన్, మోడలింగ్ రంగంలో విశేష కృషికి గాను ఆయనకు 29వ ఐఈటీఈ రామ్ లాల్ వాధ్వా గోల్డ్ మెడల్ లభించింది. భారతదేశ ఎలక్ట్రానిక్స్ -సెమీకండక్టర్ అసోసియేషన్ అందించే మొట్టమొదటి ఐఎస్ఏ అండ్ వీఎస్ఐ టెక్నోమెంటర్ అవార్డును కూడా ఆయన అందుకున్నారు.ఆయన అందించిన సేవలకు గుర్తింపుగా 2008 ఐబీఎం ఫ్యాకల్టీ అవార్డును పొందారు.

యూజీసీ నియమితులైన తరువాత మాట్లాడుతూ.. ‘నూతన బాధ్యతలు చాలెంజింగ్ గా ఉంటాయని భావిస్తున్నా. నూతన జాతీయ విద్యా విధానం ఎంత తొందరగా అమల్లోకి వస్తే దేశానికి అంత మేలు జరుగుతుంది. ఇదే విషయమై త్వరలో అన్ని విశ్వవిద్యాలయాల వీసీల తో సమావేశం అవుతాను. మల్టీ డిసిప్లినరీ కోర్సుల విషయమై చర్చిస్తాం. ప్రభుత్వం ఇటీవలే బడ్జెట్లో డిజిటల్ యూనివర్సిటీని ప్రకటించింది. విద్యను మరింత సులభతరం చేసే డిజిటల్ సాంకేతికత కూడా ప్రాధాన్య జాబితాలో ఉంటుంది’ అన్నారు.