తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన ఓటుకు నోటు కేసు మరోసారి తెరపైకి వచ్చింది. ఈ కేసు విచారణ మళ్లీ ప్రారంభమైంది. ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం చంద్రబాబు నాయుడు, ఎంపీ రేవంత్‌రెడ్డి వర్గం నుంచి ప్రాణహాని ఉందంటూ ఓటుకు నోటు కేసులో ఏ4 నిందితుడు జెరూసలేం మత్తయ్య తెలిపారు. ఈ మేరకు గురువారం రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ (హెచ్చార్సీ)ను ఆశ్రయించారు.

ఈ కేసులో అప్రూవర్‌గా మారినందున తనను చంపేందుకు కుట్ర జరుగుతోందని ఆరోపించారు. ఈ నేపథ్యంలోనే తనకు ఈడీ నుంచి నోటీసులు వచ్చినట్లు వివరించారు. ఈ కేసులో ముఖ్య సూత్రధారులు చంద్రబాబు నాయుడు, రేవంత్‌రెడ్డిలేనని చెప్పారు. కేసు పూర్తయ్యే వరకు తనకు రక్షణ కల్పించాలని ఫిర్యాదులో కోరారు. అదేవిధంగా ఎంపీ రేవంత్‌రెడ్డి పార్లమెంట్ సభ్యత్వాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
2015లో తెలంగాణలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో ఈ ఓటుకు నోటు కేసు తెరపైకి వచ్చింది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో నామినేటెడ్ ఎమ్మెల్సీ స్టీఫన్‌సన్‌ను ప్రలోభాలకు గురి చేసిన ఆరోపణలతో అప్పటి టీడీపీ నేతలు రేవంత్ రెడ్డి, సండ్ర వెంకట వీరయ్య, ఉదయ సింహాలపై ఏసీబీ కోర్టు కేసు నమోదు చేసింది.
నామినేటెడ్ ఎమ్మెల్సీ స్టీఫన్‌సన్‌కు రేవంత్ రెడ్డి రూ.50 లక్షల నగదును ఇస్తున్న వీడియోలు సైతం అప్పట్లో కలకలం సృష్టించాయి. ఎమ్మెల్సీ ఎన్నికల్లో వేం నరేందర్ రెడ్డిని గెలిపించుకునేందుకు ఈ బేరం ఆడినట్లుగా ఆరోపణలు ఉన్నాయి. అంతేకాకుండా, స్టీఫన్ సన్‌తో పలువురు టీడీపీ నేతలు మాట్లాడిన ఆడియోలు సైతం అప్పట్లో వెలుగు చూశాయి. కాగా ఇదే కేసులో ప్రస్తుత కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి జైలుకెళ్లారు.
Read Exclusive COVID-19 Coronavirus News updates, from Telangana, India and World at Asianet News Telugu.
వర్చువల్ బోట్ రేసింగ్ గేమ్ ఆడండి మిమ్మల్ని మీరు ఛాలెంజ్ చేసుకోండి ఇప్పుడే ఆడటానికి క్లిక్ చేయండి
Last Updated Dec 11, 2020, 9:14 AM IST