Asianet News TeluguAsianet News Telugu

హరీష్ రావు ఆ పని బాగానే చేస్తుండు

  • పోచారం కు పంటలపై అవగాహన లేదు
  • కేసిఆర్ పంపే స్క్రిప్ట్ చదివి పోతాడు
  • కైలు రైతులకు నాలుగు వేలు ఇవ్వాలి
Jeevan reddy says pocharam is only reading scripts of KCR

తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి పోచారంపై, ఇరిగేషన్, మార్కెటింగ్ శాఖ మంత్రి హరీష్ రావుపై విమర్శలు గుప్పించారు మాజీ మంత్రి, కాంగ్రెస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి. పోచారం మీద కూడా జీవన్ రెడ్డి నిప్పులు చెరిగారు. మార్కెటింగ్ శాఖ మంత్రి అయిన హరీష్ రావు తెలంగాణ సర్కారును బాగానే మార్కెట్ చేస్తున్నారని ఎద్దేవా చేశారు.

పప్పు దినుసులకు మద్దతు ధర కాకుండా 500 రూపాలు బోనస్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. పక్క రాష్ట్రాలు ఇస్తున్నాయి..బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కూడా బోనస్ ఇస్తున్నారని గుర్తు చేశారు. హరీష్ రావు టి ఆర్ ఎస్ ప్రభుత్వాని మార్కెట్ చేయడానికి బాగా పని చేస్తున్నారని ఎద్దేవా చేశారు. వాణిజ్య పంటకు కూడా పెట్టుబడి అందించాలన్నారు.

ఇక వ్యవసాయ శాఖ మంత్రి పోచారానికి పంటల మీద అవగాహన కూడా లేదని ఎద్దేవా చేశారు. ఆయనేం మంత్రి అని ప్రశ్నించారు. ఇంకా అనేక అంశాలపై జీవన్ రెడ్డి మాట్లాడారు. ఆ మాటలు చదవండి.

పెట్టుబడి ఇస్తున్నామని ప్రచారం చేసుకుంటున్నారు కానీ రైతుల పై ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు. రబీ నుండే 4 వేలు ఇచ్చి రైతులను ఆదుకోవాలి. కౌలు రైతులు, పట్టేదారులు అనే భేదం లేకుండా పెట్టుబడి అందించాలి. కౌలు రైతులకు కూడా 4 వేల పెట్టుబడి ఇవ్వాలి. ఎవరు భూమి సాగు చేస్తే వారికే పెట్టుబడి ఇవ్వాలి.

ఉమ్మడి రాష్ట్రంలో కౌలు రైతులకు  బ్యాంక్ ల నుండి పెట్టుబడులు కూడా ఇచ్చాము. పసుపు లో మొక్కజొన్న వేస్తారు.. మొక్కజొన్న పంట చేతికి వచ్చిన తర్వాత పసుపును తీసుకుంటాం. పంటల పై అవగాహన లేకుండా పోచారం మాట్లాడుతున్నారు. కేసీఆర్ స్క్రిప్ట్ పంపిస్తే పోచారం అదే చదువుతున్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios