JanaSena: అయోమయంలో జనసేనాని..! తెలంగాణ ఎన్నిక బరిలో దిగేనా!?
JanaSena: తెలంగాణ రాజకీయం వేడేక్కింది. అన్ని పార్టీలు పోటీపోటీగా ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తున్నాయి. కానీ,తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేయడంపై జనసేనాని పునరాలోచనలో పడినట్టు తెలుస్తోంది. అసలేం జరిగింది? బీజేపీ- జనసేన పొత్తు పరిస్థితేంటీ? ఢిల్లీ పెద్దలను కలిసిన తర్వాత జనసేనాని పవన్ కళ్యాణ్ ఎందుకు సైలెంట్ అయ్యారు?
Telangana Elections 2023: తెలంగాణ రాజకీయాలు రోజురోజుకు వేడేక్కుతున్నాయి. అన్ని పార్టీలు దాదాపు అభ్యర్థులను ప్రకటించి.. పోటీపోటీగా ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తున్నాయి. కానీ కొన్ని పార్టీలకు తిప్పలు తప్పడం లేదు. అసమ్మతి నేతలు, ఆశవాహా నేతలు ఫిరాయింపులకు పాల్పడుతూ.. పార్టీలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నారు. ఇక బీజేపీ పరిస్థితి మాత్రం మరింత దారుణంగా తయారైంది. అసంత్రుప్తి నేతలను పార్టీలో నిలుపుకోలేక, వేరే పార్టీ నేతలతో పొత్తులు కుదరలేక అయోమయంలో పడింది.
ఈ తరుణంలో కమలం పార్టీతో కలిసి పోటీ చేయాలని భావించినా జనసేన పరిస్థితి ఇక చెప్పనవసరం లేదు. రెంటికీ చెడ్డ రేవడిలా మారింది. తెలంగాణలో పోటీ చేయాలా? వద్దా? అనే సందేహాలు వస్తున్నాయి. వాస్తవానికి ఢిల్లీ పెద్దలతో మాట్లాడిన తర్వాత జనసేనాని ఏ నిర్ణయం వెల్లడించలేదు. ఫ్యామిలీ పంక్షన్ ఉంటే.. సతీసమేతంగా ఇటలీ వెళ్లిపోయాడు. ఈ తరుణంలో తెలంగాణలో జనసేన పోటీ చేస్తుందా? లేదా? లేక తెలుగుదేశం పార్టీ లాగా సైలెంట్ గా ఉంటుందా? అనే చర్చ సాగుతుంది. జనసైనికులు కూడా ఏటు తేల్చుకోలేక అయోమయంలో పడ్డారు. తెలంగాణలో బీజేపీతో కలిసి పోటీ చేస్తే.. కనీసం ఒక్క సీటు కూడా రాకపోతే..? పోటీ చేసిన స్థానాల్లో డిపాజిట్ కూడా దక్కపోతే.. పరిస్థితేంటీ? ఆ ప్రభావం ఏపీ ఎన్నికలపై పడుతోందా ? అనవసరంగా పరువు పోగొట్టుకోవడం ఎందుకనే బావిస్తున్నారా? ఆంధ్ర సెటిలర్లు కూడా కాంగ్రెస్ వైపే ఉన్నారనే అంచనాలు వెలువడుతున్న సమయంలో అనవసరంగా పోటీ చేసి అభాసుపాలు కావడం ఎందుకు లేనని జనసేనాని పునారాలోచనలో పడినట్లు పలువురు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.
తెలంగాణలో పోటీ చేయాలని జనసేనాని పవన్ కళ్యాణ్ తొలుత నిర్ణయించుకున్న విషయం తెలిసిందే.. ఈ మేరకు 32 స్థానాల్లో బరిలో దిగాడానికి కసరత్తు చేశారు. కాగా..ఏపీలో జనసేన- టీడీపీ కలిసి పోటీలో చేస్తారనే ప్రచారం జరుగుతున్న తరుణంలో టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ కావడం. ఏపీలో రాజకీయాలు ఒక్కసారిగా మారడంతో జనసేనాని తన ఫోకస్ ను ఏపీ పాలిటిక్స్ పైకి షిప్ట్ చేశారు. చంద్రబాబు అరెస్టును తీవ్రంగా ఖండించారు. ఆయనకు అండగా, టీడీపీకి మద్దతుగా నిలిచారు. ఇలాంటి క్లిష్ట పరిస్థితిలో టీడీపీ.. తెలంగాణ ఎన్నికల పోటీకి దూరంగా ఉంది. ఆ పార్టీ తెలంగా ప్రతినిధి కాసాని కూడా సైకిల్ దిగి కారు ఎక్కడానికి సిద్దమయ్యాడు. మరోవైపు.. తెలంగాణలో రాజకీయ పరిస్థితులు కూడా తారుమారయ్యాయి. టీడీపీ ఎన్నికలకు దూరం కావడంతో ఆంధ్ర సెటిలర్లు ఈ సారి కాంగ్రెస్ వైపే మొగ్గు చూపుతున్నట్టు పలు అంచనాలు వెలువడ్డాయి.
పునరాలోచనలో జనసేనాని
ఈ తరుణంలో తెలంగాణలో పోటీ చేయడంపై జనసేనాని పునరాలోచనలో పడినట్టు టాక్ వచ్చింది. ఎందుకంటే.. బీజేపీ అధిష్టాన పెద్దలను కలిసిన తర్వాత జనసేనాని పవన్ కళ్యాణ్ ఎలాంటి ప్రకటనా చేయలేదు. దీంతో పోటీ చేసే స్థానాలు, సీట్ల సర్దుబాటులో పొత్తు కుదరలేదని అంతా భావించారు. కానీ, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ పోటీ చేయకూడదనే నిర్ణయించుకున్న తరువాత పవన్ కళ్యాణ్ పోటీ విషయంలో పునరాలోచన చేస్తున్నట్టు తెలుస్తోంది.
తాము పోటీ చేసే స్థానంలో ఒక్క సీటు అయినా గెలువగలమా? ఏపీ సెటిలర్లు జనసేనకు మద్దతు ఇస్తారా? మరోవైపు.. బీజేపీ గ్రాఫ్ రోజురోజుకు పడిపోతుంది. ఈ తరుణంలో కమలం పార్టీలో కలిసి పోటీ చేసే.. ప్రయోజనమేముంది? పోటీ చేసినా ఆశించిన స్థాయిలో ఫలితాలు వస్తాయా? ఒక్క వేళ ఇక్కడ ఓడిపోతే.. ఆ ప్రభావంతో ఆంధ్ర ఎన్నికలపై తీవ్ర ప్రభావం చూపుతాయని జనసేన నేతల్లో జోరుగా చర్చలు సాగుతున్నాయి.