జనసేన అధినేత పవన్ కల్యాణ్ గురువారం ఖైరతాబాద్ ఆర్టీఏ కార్యాలయంలో సందడి చేశారు. జనసేన వాహనాల రిజిస్ట్రేషన్ కోసం ఆయన ఆఫీసుకు వచ్చారు. దీంతో పవన్‌ను చూసేందుకు అభిమానులు , సిబ్బంది ఎగబడ్డారు.
జనసేన వాహనాల రిజిస్ట్రేషన్ కోసం ఖైరతాబాద్ ఆర్టీఏ ఆఫీసుకు వెళ్లారు పవన్ కల్యాణ్. ఇప్పటికే వారాహి వాహనాన్ని రిజిస్ట్రేషన్ చేయించారు . ఏపీలో యాత్రకు సిద్ధమవుతోన్న జనసేనాని ముందుగా తన క్యాంపెయిన్‌కు సంబంధించిన మరికొన్ని వాహనాలను కూడా సిద్ధం చేసుకుంటున్నారు. వాటికి రిజిస్ట్రేషన్ చేయిస్తున్నారు జనసేనాని.
ఇదిలావుండగా.. పవన్ కల్యాణ్ ఈ నెల 7వ తేదీన సోషల్ మీడియాలో ఎన్నికల సమరానికి వారాహి సిద్దంగా ఉందంటూ ఓ పోస్టు చేశారు. తాను ప్రచారం నిర్వహించనున్న వాహనం ఫొటోలు, వీడియోను షేర్ చేశారు. అయితే వాహనం రంగుపై వైసీపీ నుంచి అభ్యంతరం వ్యక్తం అయింది. పవన్ వాహనంపై ఉన్న ఆలివ్ గ్రీన్ కలర్‌ను డిఫెన్స్ వాహనాలు మినహా ఇతర వాహనాలకు ఉపయోగించకూడదని మాజీ మంత్రి పేర్ని నాని అన్నారు. కేంద్ర మోటారు వాహన చట్టం ఇదే విషయాన్ని స్పష్టంగా చెబుతుందని అన్నారు. అదే రంగు ఉంటే వాహనం రిజిస్టర్ అవ్వద్దని చెప్పారు. పవన్ కళ్యాణ్ చట్టాన్ని ఉల్లంఘిస్తున్నారని ఆరోపించారు. వాహనం రంగును ఎలాగో మర్చాలి కదా.. అదేదో పసుపు రంగు వేసుకుంటే సరిపోతుందని వ్యంగ్యస్త్రాలు సంధించారు.
ALso REad: దమ్ముంటే వారాహిని టచ్ చేయండి.. నేనేంటో చూపిస్తా : వైసీపీ నేతలకు పవన్ వార్నింగ్
దీంతో పవన్ ప్రచార వాహనం రంగుపై జనసేన, వైసీపీ మద్దతుదారులు సోషల్ మీడియా వేదికగా ఒకరినొకరు దూషించుకోవడం మొదలుపెట్టారు. ఈ క్రమంలోనే స్పందించిన పవన్ కల్యాణ్ వైసీపీకి కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేశారు. తనను అడ్డుకునేందుకు వైసీపీ ప్రయత్నిస్తోందని ట్వీట్ చేశారు. “మొదట మీరు నా సినిమాలను ఆపేశారు. విశాఖపట్నంలో నన్ను వాహనం, హోటల్ గది నుండి బయటకు రానివ్వలేదు. నన్ను నగరం వదిలి వెళ్ళమని బలవంతం చేశారు. మంగళగిరిలో నా కారును బయటకు వెళ్లనివ్వలేదు, తర్వాత నన్ను నడవనివ్వలేదు. ఇప్పుడు వాహనం రంగు సమస్యగా మారింది. ఒకే తర్వాత నేను శ్వాస తీసుకోవడం ఆపేయమంటారా?’’ అని పవన్ ట్వీట్ చేశారు.
ఇకపోతే.. వారాహి వివాదంపై తెలంగాణ రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్. అన్నీ అనుమతులున్నందునే రిజిస్ట్రేషన్ చేసినట్టుగా రవాణాశాఖాధికారులు చెబుతున్నారు పవన్ కళ్యాణ్ . వారాహి వాహనానికి టీఎస్ 13 ఈఎక్స్ 8384 నెంబర్ కేటాయించారు రవాణాశాఖాధికారులు. తెలంగాణ రాష్ట్రంలోని హైద్రాబాద్ పశ్చిమ రీజినల్ రవాణా శాఖ కార్యాలయంలో ఈ వాహనం రిజిస్ట్రేషన్ చేయించారు. అలాగే వాహనం రంగుపైనా తమకు ఎలాంటి అభ్యంతరాలు లేవని అజయ్ కుమార్ పేర్కొన్నారు.
