తెలంగాణలో జనసేన జెండా ఎగరాలి: పవన్ కళ్యాణ్

తెలంగాణ ఉద్యమంలో విద్యార్ధులు కీలక పాత్ర పోషించారని జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ చెప్పారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో జనసేనాని శుక్రవారం నాడు పర్యటించారు.

Jana sena Chief Pawan Kalyan Gives Five Lakh Cheque To Party Worker Saidulu Family In Nalgonda District

హైదరాబాద్: తెలంగాణ ఉద్యమంలో విద్యార్ధులే కీలక పాత్ర పోషించారని Jana Sena చీఫ్ పవన్ కళ్యాణ్ ప్రకటించారు. శుక్రవారం నాడు ఉమ్మడి నల్గొండ జిల్లాలోని  జనసేన చీఫ్ Pawan Kalyan పర్యటించారు. Telangana రాజకీయాల్లో కూడా విద్యార్ధులు కీలక పాత్ర పోషించాలని కూడా ఆయన కోరారు.శుక్రవారం నాడు ఉమ్మడి Nalgonda  జిల్లాలో  పవన్ కళ్యాణ్ పర్యటించారు.ఈసందర్భంగా ఆయన మాట్లాడారు.

తెలంగాణలో జనసేన జెండా ఎగరాలని పవన్ కళ్యాణ్ అన్నారు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో జనసేన కచ్చితంగా పోటీ చేస్తుందని పవన్ కళ్యాణ్ తేల్చి చెప్పారు.పోలీసు ఉద్యోగాల వయో పరిమితిని సడలించాలని ప్రభుత్వంతో మాట్లాడుతానని కూడా పవన్ కళ్యాణ్ యువతకు హామీ ఇచ్చారు.యువత బలం జనసేనకు ప్రధాన ఆయుధమని పవన్ కళ్యాణ్ చెప్పారు. 

రాబోయే ఎన్నికల్లో తెలంగాణలో మూడోవంతు స్థానాల్లో పోటీ చేయనున్నట్లు పవన్ కళ్యాణ్ ప్రకటించారు. ప్రతీ నియోజకవర్గంలో తమకు  5 వేల ఓట్లు ఉన్నాయన్నారు. తెలంగాణ రాష్ట్రంలో వెనుకబడిన అన్ని వర్గాల వారికి అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం ఎంతో మంది త్యాగాలు చేశారన్నారు. సామాజిక మార్పు కోసమే జనసేన అని స్పష్టం చేశారు.

అనుకున్న లక్ష్యాన్ని సాధించడం కోసం ఎన్ని ఓటములైనా భరిస్తామని చెప్పారు. ఆంధ్రలోనే అధికారం ఆశించలేదన్నారు.తెలంగాణలో అధికారం ఎలా ఆశిస్తానని ప్రశ్నించారు. వారసత్వ రాజకీయాలకు తాను వ్యతిరేకమన్నారు. రాజకీయాల్లో కొత్త తరం రావాలని అభిప్రాయపడ్డారు. తెలంగాణలో గెలుపు-ఓటములను జనసేన ప్రభావితం చేస్తుందని పవన్ కళ్యాణ్ వెల్లడించారు

also read:రేపు నల్గొండ జిల్లాలో పవన్ కల్యాణ్ పర్యటన.. వారి కుటుంబాలకు పరామర్శ, ఆర్థిక సాయం..

ఇటీవల చనిపోయిన జన సైనికుల కుటుంబాలను పరామర్శించారు. పార్టీ తరపున ఆర్థిక సాయం అందించారు. నల్గొండ జిల్లా Choutuppal  మండలం లక్కారానికి చెందిన జనసేన కార్యకర్త కొంగరి సైదులు రోడ్డు ప్రమాదంలో చనిపోయారు. సైదులు కుటుంబాన్ని పరామర్శించారు పవన్ కళ్యాణ్. 

జనసేన పార్టీ తరపున ఐదు లక్షల రూపాయల సాయానికి సంబంధించిన చెక్ అందించారు.  ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణలో పార్టీ పటిష్టతపై ేకంద్రీకరించనున్నట్టుగా పవన్ కళ్యాణ్ చెప్పారు. చౌటుప్పల్ నుండి కోదాడకు పవన్ కళ్యాణ్ బయలు దేరారు. కోదాడలో ఇటీవల చనిపోయిన జనసేన కార్యకర్త కడియం శ్రీనివాస రావు కుటుంబాన్ని పరామర్శించి ఐదు లక్షల చెక్ అందిస్తారు.
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios