బీజేపీ నేతల హుందాతనానికి, జానా చొరవకు ఈ వీడియో ఓ ఉదాహరణ 

నిజంగా రాజకీయాల్లో ఇది మంచి పరిణామం. పార్టీల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గు మనేలా ఉండాలి అనే టైప్ కు ఇప్పుడు రాజకీయాలు మారిపోయాయి.

కానీ, అప్పడప్పుడు ఇలాంటి సంఘటనలు జరుగుతుంటాయి.

ఈ రోజు అసెంబ్లీలో ప్రభుత్వాన్ని ఏకిపడేసిన సీఎల్పీ నేత జానా రెడ్డి పనిలో పనిగా అసెంబ్లీలోనే ఉన్న బీజేపీ కార్యాలయానికి వచ్చారు.

అక్కడ ఎమ్మెల్యే చింతల తదితరులు ఆయనను పార్టీ కార్యాలయంలోకి ఆహ్వానించారు. అక్కడ బీజేపీ నేత కిషన్ రెడ్డి కుర్చీలో కూర్చొబెట్టి ఆయనను గౌరవించారు.

జానా కూడా చాలా హుందాగా అక్కడ బీజేపీ నేతలతో ప్రజల సమస్యపై ఇలా చర్చించారు.