సంక్రాంతి పండగను పురస్కరించుకొని హైదరాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో జనవరి 13నుంచి 15వ తేదీ వరకు కైట్ ఫెస్టివల్, స్వీట్ ఫెస్టివల్ నిర్వహించనున్నట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.ఎస్ కే జోషి తెలిపారు.
సంక్రాంతి పండగను పురస్కరించుకొని హైదరాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో జనవరి 13నుంచి 15వ తేదీ వరకు కైట్ ఫెస్టివల్, స్వీట్ ఫెస్టివల్ నిర్వహించనున్నట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.ఎస్ కే జోషి తెలిపారు.
మంగళవారం సచివాలయంలో అంతర్జాతీయ పతంగుల పండుగ, అంతర్జాతీయ మిఠాయిల వేడుక నిర్వహణపై ఉన్నతస్ధాయి సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో టూరిజం, సాంస్కృతిక శాఖ కార్యదర్శి బి.వెంకటేశం, హైదరాబాద్ నగర కమీషనర్ అంజనీకుమార్, టూరిజం కమిషనర్ దినకర్ బాబు, ఫైర్ సర్వీసెస్ డిజి గోపికృష్ణ, సాంస్కృతిక శాఖ డైరెక్టర్ హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు.
సి.యస్ ఎస్.కె.జోషి మాట్లాడుతూ... హైదరాబాద్ నగర బ్రాండ్ ఇమేజ్ పెరిగే విధంగా పకడ్భందీ ఏర్పాట్లు చేపట్టాలన్నారు. ప్రతిరోజు 3 లక్షల మంది సందర్శకులకు తగ్గట్లు ఏర్పాట్లు ఉండాలన్నారు. బ్యారికేడింగ్, పరిశుభ్రత, ట్రాఫిక్, అగ్నిమాపక వ్యవస్ధ, బందోబస్తు, మంచినీటి సరఫరా, వైద్యసేవలు అందివ్వాలని అన్నారు. ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు ఏర్పడకుండా లే అవుట్ ను రూపొందించుకొని పనులు చేపట్టాలన్నారు.
టూరిజం శాఖ కార్యదర్శి బి.వెంకటేశం మాట్లాడుతూ... కైట్ ఫెస్టివల్ వచ్చే సంవత్సరంనాటికి హైదరాబాద్ లో అతిపెద్ద పండుగ గా ఉండేలా కృషి చేస్తున్నామని, 20 దేశాలనుండి 50 మంది పతంగులు ఎగురవేసే నిపుణులు పాల్గొంటారని, వివిధ రాష్ట్రాల మహిళలు 1000 రకాల మిఠాయిలు ప్రదర్శిస్తారని అన్నారు.వివిధ రాష్ట్రాల సంస్కృతి సాంప్రదాయాలకు అనుగుణంగా మిఠాయిలు తయారు చేస్తారని అన్నారు. సాంప్రదాయ దుస్తులతో పాల్గొంటారని అన్నారు. ప్రతిరోజు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. దాదాపు పదిలక్షల మంది సందర్శిస్తారని అన్నారు.
Read Exclusive COVID-19 Coronavirus News updates, from Telangana, India and World at Asianet News Telugu.
వర్చువల్ బోట్ రేసింగ్ గేమ్ ఆడండి మిమ్మల్ని మీరు ఛాలెంజ్ చేసుకోండి ఇప్పుడే ఆడటానికి క్లిక్ చేయండి
Last Updated Jan 8, 2019, 2:31 PM IST