Asianet News TeluguAsianet News Telugu

కాంగ్రెస్‌కు నష్టం కలిగించే ఆలోచన ఉంటే మొహమాటం లేకుండా వెళ్లిపోవచ్చు.. జైరామ్ రమేష్

కాంగ్రెస్‌కు నష్టం కలిగించే ఆలోచన ఉంటే మొహమాటం లేకుండా పార్టీలో నుంచి వెళ్లిపోవచ్చని ఆ పార్టీ సీనియర్ నేత జైరామ్ రమేష్ అన్నారు. తెలంగాణలో బీజేపీకి అన్ని నియోజకవర్గాల్లో అభ్యర్థులే లేరని విమర్శించారు.

Jairam Ramesh Comments About Telangana Congress
Author
First Published Oct 22, 2022, 1:06 PM IST

కాంగ్రెస్‌కు నష్టం కలిగించే ఆలోచన ఉంటే మొహమాటం లేకుండా పార్టీలో నుంచి వెళ్లిపోవచ్చని ఆ పార్టీ సీనియర్ నేత జైరామ్ రమేష్ అన్నారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీ వాషింగ్ మిషన్‌లో జాయిన్ అయ్యి.. కాంట్రాక్టులు తెచ్చుకున్నారని ఆరోపించారు. కేసీఆర్ మూలంగా రాష్ట్రంలోని ఆర్థిక వ్యవస్థలన్నీ నాశనమయ్యాయని విమర్శించారు. కేసీఆర్ ఎనిమిదో నిజాం అని, మోదీ ఔరంగజేబు అని విమర్శించారు. 

జీహెచ్‌ఎంసీలో బీజేపీ బలంగా ఉందని.. అయితే ఆ పార్టీ కొందరు నేతలను కొనుగోలు చేసి కొన్ని ఉప ఎన్నికల్లో గెలిచిందని జైరామ్ రమేష్ ఆరోపించారు.తెలంగాణలో బీజేపీకి అన్ని నియోజకవర్గాల్లో అభ్యర్థులే లేరని విమర్శించారు. తెలంగాణలో కాంగ్రెస్, టీఆర్ఎస్‌ల మధ్యనే పోటీ ఉంటుందన్నారు. తెలంగాణలో 11 రోజుల పాటు రాహుల్ యాత్ర సాగుతుందన్నారు. తమిళనాడు, కేరళ, కర్ణాటక, ఏపీలో వచ్చినట్టుగానే.. తెలంగాణలో కూడా రాహుల్ యాత్రకు విశేష స్పందన వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఓ తెలుగు న్యూస్ చానల్‌తో మాట్లాడుతూ జైరాం రమేష్ ఈ కామెంట్స్ చేశారు. 

ఇక, దేశవ్యాప్తంగా  కాంగ్రెస్ పార్టీ పునరుజ్జీవం కోసం ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర.. ఆదివారం (అక్టోబర్ 7) తెలంగాణలోకి ప్రవేశించనుంది. నవంబర్ 7 వరకు రాష్ట్రంలో రాహుల్ యాత్ర సాగనుంది. అయితే దీపావళి సందర్భంగా  అక్టోబర్ 24,25 తేదీల్లో, కాంగ్రెస్ అధ్యక్షుడిగా మల్లికార్జున ఖర్గే బాధ్యతల స్వీకరణ సందర్భంగా అక్టోబర్ 26వ తేదీన రాహుల్ పాదయాత్రకు బ్రేక్ ఇవ్వనున్నారు. భారత్ జోడో యాత్ర నవంబర్ 1 న శంషాబాద్ మీదుగా హైదరాబాద్‌లోకి ప్రవేశించనుంది.
 

Follow Us:
Download App:
  • android
  • ios