కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి జైపాల్ రెడ్డి అంతిమయాత్ర ప్రారంభమైంది. ఆయన పార్థివదేహాన్ని జూబ్లీహిల్స్‌లోని ఆయన నివాసం నుంచి జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్, పంజాగుట్ట మీదుగా గాంధీభవన్‌కు తీసుకెళతారు.

ప్రజలు, కార్యకర్తల సందర్శనార్ధం ఉంచుతారు. అనంతరం నెక్లెస్‌రోడ్‌లోని పీవీఘాట్ సమీపంలో అధికారిక లాంఛనాలతో జైపాల్‌రెడ్డి అంత్యక్రియలు జరుగుతాయి.

సోమవారం ఉదయం తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, మంత్రులు మహమూద్ అలీ, ఇంద్రకరణ్ రెడ్డి, మాజీ మంత్రి హరీశ్ రావు‌తో పాటు పలువురు నేతలు జైపాల్‌రెడ్డికి నివాళులర్పించారు.