జగిత్యాల: కేసీఆర్ కూతురు కల్వకుంట్ల కవిత కోసం అవసరమైతే తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ సంచలన ప్రకటన చేశారు. జగిత్యాల నుండి కవితను గెలిపించుకొంటామని ఆయన స్పష్టం చేశారు.

బుధవారం నాడు డాక్టర్ సంజయ్ మీడియాతో మాట్లాడారు. హుజూర్‌నగర్‌ అసెంబ్లీ స్థానం నుండి కవిత పోటీ చేయరని ఆయన తేల్చి చెప్పారు. ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు కవిత సిద్దమైతే.... తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని  ఆయన ప్రకటించారు.

ఈ ఏడాది ఏప్రిల్ 11వ తేదీన జరిగిన ఎన్నికల్లో నిజామాబాద్ ఎంపీ స్థానానికి కవిత పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఈ స్థానంలో బీజేపీ అభ్యర్ధి ధర్మపురి అరవింద్ విజయం సాధించారు.

గత ఏడాది డిసెంబర్ మాసంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో  జగిత్యాల అసెంబ్లీ స్థానం నుండి పోటీ చేసిన డాక్టర్  సంజయ్‌ను గెలిపించడంలో కల్వకుంట్ల కీలకంగా వ్యవహరించారు. ఈ స్థానంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జీవన్ రెడ్డి ఓటమిలో  కవిత కీలకపాత్ర పోషించారు.

సంబంధిత వార్తలు

ఎమ్మెల్యేలను గెలిపించి తానోడిన కవిత