కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల ఎంపికైన లిస్టు హైదరాబాద్ కు కాకుండా అమరావతికి వెళ్లడం సిగ్గుచేటని నిజామాబాద్ ఎంపి కవిత విమర్శించారు. 130 సంవత్సరాల చరిత్ర గల కాంగ్రెస్ ప్రస్తుతం దయనీయ పరిస్థితిలో ఉందని....కనీసం అభ్యర్థులను కూడా స్వయంగా ఎంపిక చేసుకోలేని పరిస్థితుల్లో ఉందని అన్నారు. డిల్లీనుండి అభ్యర్థుల లిస్ట్ అమరావతికి చేరిందని...దీన్ని బట్టే కాంగ్రెస్ పరిస్థితి ఏంటో ప్రజలకు అర్థం అవుతోందంటూ కవిత ఎద్దేవా చేశారు.

చంద్రబాబు సూచించిన వ్యక్తులకే కాంగ్రెస్ పార్టీ టికెట్లు ఇవ్వనుందన్నారు. ఇలా బ్యాక్ డోర్ పాలిటిక్స్ చేయడంలో చంద్రబాబుకు బాగా అనుభవం ఉందని కవిత మండిపడ్డారు.  అందువల్ల మహాకూటమిని తెలంగాణ ప్రజలు తిప్పికొట్టి టీఆఆర్ఎస్ కు మద్దతుగా నిలవాలని కవిత ప్రజలకు సూచించారు. 

జగిత్యాలకు చెందిన శైలేందర్ రెడ్డితో పాటు పలువురు యువకులు ఎంపి కవిత సమక్షంలో టీఆర్ఎస్ లో చేరారు. ఈ సందర్భంగా కవిత జగిత్యాల అభివృద్ది గురించి. చంద్రబాబు రాజకీయాల గురించి మాట్లాడారు. ఇంకా కవిత ఏం మాట్ాడారో కింది వీడియోలో చూడండి. 

వీడియో

"