Asianet News TeluguAsianet News Telugu

మామాఅల్లుళ్లే ముంచారట

సీఎం కేసీఆర్, హరీశ్ రావులపై జగ్గారెడ్డి ఫైర్

jaggareddy fire on cm kcr and harishrao

 

తెలంగాణ సీఎం కేసీఆర్ కంచుకోటలో ఢీ అంటే ఢీ అనే ఏకైక మొనగాడిగా పేరుతెచ్చుకున్న జగ్గారెడ్డికి కోపం వచ్చింది. చాలా రోజులుగా సైలెంట్ గా ఉన్న ఈ సీనియర్ కాంగ్రెస్ నేతకు తన ఇలాఖాలో జరిగిన ఓ సంఘటన చికాకు తెప్పించింది.

 

సంగారెడ్డి అంటే జగ్గా రెడ్డి... జగ్గారెడ్డి అంటే సంగారెడ్డి అనే మాదిరిగా పేరుతేచ్చుకున్న ఈ ఫైర్ బ్రాండ్ మళ్లీ తనదైన స్టైల్ లో టీఆర్ఎస్ పై విరుచుకపడ్డారు.

 

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ముఖ్యంగా వైఎస్ హయాంలో జగ్గారెడ్డి ప్రాభవం ఒక వెలుగు వెలిగింది. వైఎస్ కు సన్నిహితుడిగా ఉంటూ తన నియోజకవర్గంలో చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు.

 

అయితే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత టీఆర్ఎస్ పాలన మొదలయ్యాక సీన్ రివర్స్ అయింది. జగ్గారెడ్డి తలుచుకున్న సంగారెడ్డి లో ఏ పని జరగడం లేదు.

 

జగ్గారెడ్డి మీద కోపంతో సంగారెడ్డి అభివృద్ధిని ప్రభుత్వం విస్మరిస్తోందనే ఆరోపణలు కూడా వస్తున్నాయి. దీనికి నిదర్శనంగా సంగారెడ్డి కి  మంజూరైన ఓ మెడికల్ కాలేజీ ఉదంతాన్ని చెప్పుకోవచ్చు.

 

గతంలో సంగారెడ్డిలో నిర్మించతలపెట్టిన మెడికల్ కాలేజీని ఇప్పుడు ప్రభుత్వం సిద్ధిపేటకు తరలించింది. సహజంగా ఇది జగ్గారెడ్డి ఆగ్రహానికి కారణమవుతోంది. అందుకే సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్ రావులు కావాలనే  మెడికల్ కాలేజీని సిద్ధిపేటకు తరలించుకుపోయారని జగ్గారెడ్డి ఫైర్ అవుతున్నారు. మెడికల్ కాలేజీ కోసం ప్రజా ఉద్యమాలు చేస్తామని హెచ్చరిస్తున్నారు.

 

ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ అసమర్థత వల్లే  మెడికల్ కాలేజీ సిద్ధిపేటకు తరలిపోయిందని,   కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక్కసారి కూడా సంగారెడ్డికి రాలేదని తప్పుపట్టారు. సంగారెడ్డి తెలంగాణలో ఉందనే విషయాన్ని సీఎం గ్రహించాలని నిప్పులు చెరిగారు.

 

Follow Us:
Download App:
  • android
  • ios