తెలంగాణ కాంగ్రెస్‌లో ఆ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్, సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి (Jagga Reddy) వ్యవహారం హాట్ టాఫిక్‌గా మారిన సంగతి తెలిసిందే. జగ్గారెడ్డి కాంగ్రెసు పార్టీకి రాజీనామా చేస్తారనే వార్తలు గుప్పుమన్నాయి. ఈ క్రమంలోనే జగ్గారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.  


తెలంగాణ కాంగ్రెస్‌లో ఆ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్, సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి (Jagga Reddy) వ్యవహారం హాట్ టాఫిక్‌గా మారిన సంగతి తెలిసిందే. జగ్గారెడ్డి కాంగ్రెసు పార్టీకి రాజీనామా చేస్తారనే వార్తలు గుప్పుమన్నాయి. ఆయన శనివారంనాడు అందుకు సంబంధించి అధికారిక ప్రకటన వెలువరిస్తారని మీడియాలో వార్తలు వస్తున్నాయి. నేడు ఆయన తన అనుచరులతో సమావేశం నిర్వహించిన ప్రకటన చేయవచ్చని ప్రచారం సాగుతుంది. ఈ క్రమంలోనే ఆయనను బుజ్జగించేందుకు కాంగ్రెస్ సీనియర్ నాయకులు ప్రయత్నాలు ప్రారంభించారు. కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్‌కుమార్ రెడ్డి కూడా ఫోన్‌లో జగ్గారెడ్డితో మాట్లాడినట్టుగా తెలుస్తోంది. 

మరోవైపు కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ నేరుగా జగ్గారెడ్డి‌తో భేటీ అయి చర్చలు జరిపారు. ఆయన అసంతృప్తిని తొలగించేందుకు ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు పీసీసీ జనరల్ సెక్రటరీ బొల్లు కిషన్.. జగ్గారెడ్డి కాళ్లపై పడి పార్టీ మారొద్దని బతిమిలాడారు. అయితే తాజా పరిణామాలపై స్పందించిన జగ్గారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చెప్పారు. 

ఓ టీవీ చానల్‌లో జగ్గారెడ్డి మాట్లాడుతూ.. తాను వేరే పార్టీలోకి వెళ్లనని తెలిపారు. తాను టీఆర్‌ఎస్‌ కోవర్టునా..? అంటూ ప్రశ్నించారు. తనకు పార్టీలో అవమానం జరిగిందన్నారు. టీఆర్‌ఎస్‌లోకి పోవాలంటే రెండేళ్ల క్రితమే పోయేవాడినని అన్నారు. పార్టీ కోసం పనిచేస్తున్న.. అవమానాలు పాలు కావాలా అని ప్రశ్నించారు. పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పద్దతి బాగోలేదని విమర్శించారు. తనను కోవర్డు అని ప్రచారం లేదని మాణిక్కం ఠాగూర్ పట్టించుకోవడం లేదన్నారు. పార్టీలో పరిణామాలపై అధిష్టానానికి ఫిర్యాదు చేస్తానని వెల్లడించారు. తన నిర్ణయాన్ని ఈ రోజు మధ్యాహ్నం ప్రకటిస్తానని చెప్పారు. ఇక, ఈ సందర్భంగా మాట్లాడిన వీహెచ్.. రేవంత్ రెడ్డి పద్దతి బాగోలేదని విమర్శించారు. 

ఇక, పార్టీని వీడేందుకు దారి తీసిన పరిస్థితులపై, ఇటీవల జరిగిన పరిణామాలపై ఆయన కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీకి లేఖ రూపంలో అందించాలని Jagga Reddy నిర్ణయించుకున్నట్లు సమాచారం. తన వ్యక్తిత్వాన్ని దెబ్బ తీసే విధంగా పార్టీలో కొందరు కుట్రలు చేశారని, తాను పార్టీ కోసం విశేషమైన కృషి చేసినప్పటికీ అవమానించారని, అది తట్టుకోలేకనే తాను పార్టీని వీడాలని నిర్ణయం తీసుకున్నానని ఆయన సోనియాకు లేఖలో వివరించనున్నట్లు సమాచారం. 

ఉమ్మడి మెదక్ జిల్లా నుంచి 2018 ఎన్నికల్లో కాంగ్రెసు నుంచి ఆయన ఒక్కరే శాసనసభకు ఎన్నికయ్యారు. 2004లో టీఆర్ఎస్ నుంచి పోటీ చేసి తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తర్వాత Congressలో చేరి చేరి 2009, 218 ఎన్నికల్లో విజయాలు సాధించారు. 2014లో మాత్రం టీఆర్ఎస్ అభ్యర్థి చింతా ప్రభాకర్ చేతిలో ఓడిపోయారు. రేవంత్ రెడ్డి తెలంగాణ పీసీసీ అధ్యక్షుడిగా ఎంపికైన తర్వాత జగ్గారెడ్డి ఆయనతో తీవ్రంగా విభేదిస్తూ వస్తున్నారు. 

ఇక, రేవంత్‌రెడ్డితో జగ్గారెడ్డికి విభేదాలు ముందునుంచే ఉన్నా.. గురువారం సాయంత్రం జగ్గారెడ్డి సతీమణి నిర్మలారెడ్డికి వచ్చిన ఓ ఫోన్‌కాల్‌ తాజా నిర్ణయానికి కారణమైనట్టుగా తెలుస్తోంది.