కోమటిరెడ్డి పార్టీకి నష్టం జరిగేలా మాట్లాడలేదు.. 70 సీట్లు మా టార్గెట్: జగ్గారెడ్డి

తెలంగాణ కాంగ్రెస్ వ్యవహరాల ఇంచార్జ్ మాణిక్‌రావ్ ఠాక్రేకు రాష్ట్రంలో పార్టీ బలం, బలహీనతలను వివరించినట్టుగా సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి తెలిపారు.

Jagga reddy says komatireddy venkat reddy comments was not damage the party ksm

తెలంగాణ కాంగ్రెస్ వ్యవహరాల ఇంచార్జ్ మాణిక్‌రావ్ ఠాక్రేకు రాష్ట్రంలో పార్టీ బలం, బలహీనతలను వివరించినట్టుగా సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి తెలిపారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం మీద ప్రజల్లో వ్యతిరేకత ఉందన్నారు. కాంగ్రెస్‌కు అధికారం కట్టబెట్టేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. హైదర్‌గూడ ఎమ్మెల్యే క్వాటర్స్‌లో మాణిక్‌రావ్ ఠాక్రేతో జగ్గారెడ్డి భేటీ అయ్యారు. అనంతరం జగ్గారెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ఠాక్రేను మర్యాదపూర్వకంగా కలిశానని చెప్పారు. ఠాక్రే అనుభవం తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఉపయోగపడుతుందని అన్నారు. 

కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి పార్టీ నష్టం కలిగించేలా మాట్లాడలేదని చెప్పారు. ఆయన మాటలను వక్రీకరించారని.. మాట్లాడింది ఒకటైతే.. మీడియాలో మరొకటి వచ్చిందని అన్నారు. ఎవరు ఏం మాట్లాడిన కాంగ్రెస్ పార్టీకి నష్టం జరగదని చెప్పుకొచ్చారు. బీఆర్ఎస్, బీజేపీలను ఎదుర్కోవడంతో పాటుగా.. రాష్ట్రంలో పార్టీని అధికారంలోకి తీసుకురావడంపై ఠాక్రేతో సమాలోచనలు చేసినట్టుగా చెప్పారు. 

Also Read: పొత్తులపై నా వ్యాఖ్యలపై చర్చే లేదు: ఠాక్రేతో భేటీ తర్వాత కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

ఠాక్రేతో భేటీలో పార్టీ అంతర్గత విషయాలేవీ చర్చకు రాలేదని జగ్గారెడ్డి  తెలిపారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ 70 సీట్లు సాధించేందుకు కృషి చేస్తామని చెప్పారు. తన పాదయాత్ర రూట్ మ్యాప్‌ను కూడా త్వరలోనే తెలియజేస్తానని జగ్గారెడ్డి తెలిపారు.

 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios