తన ప్రెస్‌మీట్లు, చిట్‌చాట్‌లు కొంత గందరగోళానికి గురి చేస్తున్నాయని జగ్గారెడ్డి అంగీకరించారు. తమ ఎమ్మెల్యేలు, నేతలు ఎవరూ తప్పుగా భావించవద్దని ఆయన కోరారు. 

హైదరాబాద్: పార్టీ మారే విషయంపై కాంగ్రెసు సంగారెడ్డి శాసనసభ్యుడదు జగ్గారెడ్డి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. తాను పార్టీ మారబోనని, పార్టీలు మారే ఓపిక ఇక తనకు లేదని ఆయన అన్నారు. తనకు కష్టాలున్నాయని, అయినా కూడా తనను ఎవరూ కొనలేరని ఆయన అన్నారు.

తన ప్రెస్‌మీట్లు, చిట్‌చాట్‌లు కొంత గందరగోళానికి గురి చేస్తున్నాయని జగ్గారెడ్డి అంగీకరించారు. తమ ఎమ్మెల్యేలు, నేతలు ఎవరూ తప్పుగా భావించవద్దని ఆయన కోరారు. తన మాటల వెనుక పరమార్థం ఉందని, త్వరలో అదేమిటో తెలుస్తుందని ఆయన అన్నారు. ఎమ్మెల్యేలందరూ పార్టీ వీడేది లేదని సీఎల్పీలో చెప్పారని ఆయన స్పష్టం చేశారు.

ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు రంగులు మార్చే ఊసరవెల్లి అని కాంగ్రెస్ నేత షబ్బీర్‌ అలీ ఆరోపించారు. పార్టీ మారిన ఇద్దరు ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్యేలను కొని కాంగ్రెస్‌ను తుడిచి పెట్టేయాలని చూస్తున్నారని అన్నారు. ఆత్రం సక్కు, రేగా కాంతారావు టీఆర్‌ఎస్‌కు అమ్ముడుపోయారని ఆయన వ్యాఖ్యానించారు. 

ప్రతిపక్షం ఉండకూడదు అనుకోవడం దారుణమని, ప్రజలు హర్షించరని ఎమ్మెల్యే సీతక్క అన్నారు. అధికారం శాశ్వతం కాదనే విషయాన్ని కేసీఆర్‌ గుర్తుంచుకోవాలని ఆమె అన్నారు.