హైదరాబాద్‌లోని పలు రియల్ ఎస్టేట్ కంపెనీలపై ఐటీ శాఖ దాడులు నిర్వహిస్తోంది. మొత్తం 14 రియల్ ఎస్టేట్ కంపెనీలపై అధికారులు సోదాలు చేస్తున్నారు. ఉప్పల్ నుంచి ఆలేరు వరకు వున్న వెంచర్లు వేసిన కంపెనీలపై అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు.

హైదరాబాద్, రంగారెడ్డి, నల్గొండ, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో సోదాలు నిర్వహిస్తున్నారు ఆదాయపు పన్ను శాఖ అధికారులు. హైదరాబాద్‌లో మొత్తం 40 చోట్ల సోదాలు చేస్తున్నారు. పెద్ద మొత్తంలో అమ్మకాలు జరిపినప్పటికీ.. ట్యాక్స్ ఎగ్గొట్టారన్న ఆరోపణలతో సోదాలు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఇందుకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది.