Asianet News TeluguAsianet News Telugu

వారం రోజులోగా పోలీసు స్టేషన్‌లోనే ల్యాప్ ట్యాప్.. అది తమది కాదంటున్న మల్లారెడ్డి.. ఐటీ అధికారులది అదే మాట..

తెలంగాణ కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి ఇంట్లో ఇటీవల రెండు రోజుల పాటు ఐటీ అధికారులు సోదాలు జరిపిన సంగతి  తెలిసిందే. అయితే సోదాలు సందర్భంగా ఓ ల్యాప్‌ ట్యాప్ విషయంలో హైడ్రామా కొనసాగింది. 

It raids on mallareddy laptop still on police station
Author
First Published Dec 2, 2022, 2:56 PM IST

తెలంగాణ కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి ఇంట్లో ఇటీవల రెండు రోజుల పాటు ఐటీ అధికారులు సోదాలు జరిపిన సంగతి  తెలిసిందే. అయితే సోదాలు సందర్భంగా ఓ ల్యాప్‌ ట్యాప్ విషయంలో హైడ్రామా కొనసాగింది. ప్రస్తుతం ఆ ల్యాప్ ట్యాప్ బోయిన్‌పల్లి పోలీసు స్టేషన్‌లోనే ఉండగా.. అది ఎవరిదనే విషయంలో మాత్రం స్పష్టత లేకుండా పోయింది. సోదాలు చేస్తున్న సమయంలో తమ ల్యాప్ ట్యాప్ పోయిందని ఐటీ అధికారి రత్నాకర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత కాసేపటికే మల్లారెడ్డి అనుచరులు ఓ ల్యాప్‌ట్యాప్‌ను బోయిన్‌పల్లి పోలీసు స్టేషన్‌కు తీసుకొచ్చారు. 

అయితే దీంతో పోలీసులు ల్యాప్ ట్యాప్ తీసుకెళ్లాలని ఐటీ అధికారులకు సమాచారం ఇచ్చారు. అయితే ఐటీ అధికారులు మాత్రం అది తమ ల్యాప్ ట్యాప్ కాదని చెబుతున్నారు. మరోవైపు మల్లారెడ్డి కూడా ఆ ల్యాప్ ట్యాప్ తనది కాదని చెబుతున్నారు. ఈ క్రమంలోనే ఆ ల్యాప్ ట్యాప్ విషయంలో పోలీసులు తలలు పట్టుకుంటున్నారు. వారం రోజులుగా పోలీసు స్టేషన్‌లోనే ల్యాప్ ట్యాప్ ఉండటంతో.. అది ఎవరిదో తెలుసుకునేందుకు ఎఫ్‌ఎస్‌ఎల్‌కు పంపేందుకు సిద్దమవుతున్నారు. ఆ నివేదిక ఆధారంగా ల్యాప్ ట్యాప్ ఎవరిదని దానిపై ఓ క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios