హైదరాబాద్:  ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో యాక్సెస్ ఎనర్జీ కంపెనీ గ్రూప్ సంస్థలపై ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు.

గురువారం నాడు ఉదయం నుండి రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏకకాలంలో ఐటీ అధికారులు దాడులు చేస్తున్నారు.విండ్ పవర్ లో యాక్సెస్ సంస్థ భారీగా పెట్టుబడులు పెట్టింది. దీంతో ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నారు.

also read:చెట్టినాడు గ్రూప్‌పై ఐటీ దాడులు: దేశంలోని 50 ప్రాంతాల్లో సోదాలు

యాక్సెస్ సంస్థలకు చెందిన కార్యాలయాల్లో నిర్వహించిన సోదాల్లో ఐటీ అధికారులు కీలక పత్రాలను స్వాధీనం చేసుకొన్నారని తెలుస్తోంది.

రెండు రాష్ట్రాల్లోని 20 ప్రాంతాల్లో సోదాలు చేస్తున్నారని సమాచారం. విండ్ పవర్ లో ఈ సంస్థ పెట్టుబడులకు ఎక్కడి నుండి నిధులు వచ్చాయనే విషయమై ఐటీ అధికారులు ఆరా తీస్తున్నారు.కొంతకాలంగా ఈ సంస్థకు చెందిన  ఆదాయవ్యయాలకు సంబంధించిన సమాచారాన్ని కూడ అధికారులు సేకరించారని తెలుస్తోంది.