హైదరాబాద్‌లోని పలు రియల్ ఎస్టేట్ కంపెనీల్లో సోదాలు జరగడం కలకలం రేపుతోంది. గూగి కంపెనీ యజమాని యాసిన్ ఫాతిమా ఇళ్లు, కార్యాలయాలు సహా మొత్తం 20 చోట్ల ఏకకాలంలో సోదాలు జరుగుతున్నాయి. 

హైదరాబాద్‌లోని పలు రియల్ ఎస్టేట్ కంపెనీల్లో సోదాలు జరగడం కలకలం రేపుతోంది. దిల్‌సుఖ్‌నగర్‌లోని గూగి రియల్ ఎస్టేట్ కంపెనీ ప్రధాన కార్యాలయంలో ఆదాయపు పన్ను శాఖ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. గూగి కంపెనీ యజమాని యాసిన్ ఫాతిమా ఇళ్లు, కార్యాలయాలు సహా మొత్తం 20 చోట్ల ఏకకాలంలో సోదాలు జరుగుతున్నాయి. మెరీడియన్ డేటా ల్యాబ్స్ లిమిటెడ్, హ్యపీ హార్స్ ఎంటర్‌ప్రైజెస్, ఫార్మా సిటీ, వండర్ సిటీ, రాయల్ సిటీ, గూగి ఫౌండేషన్, గూగి గ్లోబల్ ప్రాజెక్ట్ లిమిటెడ్, విహాంగా చిట్‌ఫండ్ ప్రైవేట్ లిమిటెడ్, ఇన్‌గ్లోబల్ ప్రైవేట్ లిమిటెడ్ తదితర సంస్థల్లోనూ ఆదాయపు పన్ను శాఖ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది.