హైదరాబాద్:  తెలంగాణ ప్రజాప్రతినిధులకు ఐటీ శాఖ గట్టి షాక్ ఇచ్చింది. ఆయా పార్టీల ఎమ్మెల్యేల అఫిడవిట్ లపై కన్నేసిన ఆదాయపు పన్ను శాఖ ఆస్తుల వ్యత్యాసాలను గుర్తించారు. 

ఎన్నికల కమిషన్‌కు, ఆదాయ పన్ను శాఖకు అభ్యర్థులు సమర్పించిన అఫిడవిట్ లపై విచారించిన ఐటీ శాఖ పలువురు ప్రజాప్రతినిధుల ఆస్తుల పెరుగుదలపై ఆరా తీసింది. 2014 ఎన్నికల అఫిడవిట్ లో పొందుపరచిన ఆస్తులు, 2018 ముందస్తు ఎన్నికల్లో సమర్పించిన అఫిడవిట్ లో పొందుపరచిన ఆదాయాలను వెరిఫికేషన్న చేసిన ఐటీ శాఖ పలువురికి నోటీసులు జారీ చేసింది. 

వారంలోగా వివరణ ఇవ్వాలంటూ నోటీసుల్లో స్పష్టం చేసింది. ఇప్పటికే ఆయా పార్టీల ఎమ్మెల్యేలకు నోటీసులు అందినట్లు తెలుస్తోంది. ఐటీ శాఖ నోటీసులతో ఆందోళనకు గురైన ఎమ్మెల్యేలు చార్టర్ అకౌంట్ల వద్దకు పరుగులు తీస్తున్నట్లు తెలుస్తోంది.