సినీనటుడు, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణకు ఐటీ ఉద్యోగులు షాకిచ్చారు. బాలకృష్ణపై ఐటీ ఉద్యోగుల సంఘం ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఐటీ ఉద్యోగులపై బాలకృష్ణ అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ వారు మండిపడుతున్నారు.

తెలంగాణ ఐటీ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు సందీప్‌ మక్తాలా రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి(సీఈవో) రజత్‌కుమార్‌కు మంగళవారం ఫిర్యాదు చేశారు. సందీప్‌ మక్తాలా మాట్లాడుతూ..చంద్రబాబు సీఎం అయ్యాకే ఐటీ ఉద్యోగులకు స్పెల్లింగ్‌ నేర్పించామనడం హాస్యాస్పదమన్నారు. 

చంద్రబాబు వల్లే ఐటీ అభివృద్ధి జరిగిందని చెప్పి ఐటీ ఉద్యోగుల మధ్య చిచ్చు పెట్టాలని కుట్ర చేస్తున్నారని మండిపడ్డారు. ఎవరో ఒకరి కృషి వల్ల ఐటీ రంగం అభివృద్ధి సాధించలేదన్నారు. ఉద్యోగుల జోలికి రాకుండా ఎవరి ప్రచారం వారు చేసుకోవాలని చెప్పారు.