చంద్రబాబు అరెస్టుపై హైదరాబాద్ విప్రో సర్కిల్‌లో ఐటీ ఉద్యోగులు నిరసన.. (వీడియో)
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్ట్‌కు నిరసనగా హైదరాబాద్‌లోని పలువురు ఐటీ ఉద్యోగులు నిరసనకు దిగారు. గచ్చిబౌలి విప్రో సర్కిల్ వద్ద ఐటీ ఉద్యోగులు ఆందోళన నిర్వహించారు.

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్ట్‌కు నిరసనగా గత మూడు రోజులుగా ఆ పార్టీ శ్రేణులు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. ఏపీ వ్యాప్తంగా టీడీపీ శ్రేణులు నిరసన కొనసాగిస్తున్నాయి. మరోవైపు తెలంగాణ టీడీపీ కూడా హైదరాబాద్‌లో నిరసన కార్యక్రమాలు చేపట్టింది. తాజాగా చంద్రబాబు నాయుడు అరెస్ట్‌కు నిరసనగా హైదరాబాద్‌లోని పలువురు ఐటీ ఉద్యోగులు నిరసనకు దిగారు. గచ్చిబౌలి విప్రో సర్కిల్ వద్ద ఐటీ ఉద్యోగులు ఆందోళన నిర్వహించారు. "ఐ యామ్ విత్ సీబీఎన్" అంటూ ఫ్లకార్డులు ప్రదర్శించి.. చంద్రబాబుకు అనుకూలంగా నినాదాలు చేశారు.
చంద్రబాబుపై ఏపీ ప్రభుత్వ కక్ష సాధింపు చర్యలకు దిగుతుందని కొందరు ఐటీ ఉద్యోగులు ఆరోపించారు. రాజకీయ కుట్రలో భాగంగానే చంద్రబాబును అక్రమ అరెస్ట్ చేశారని అన్నారు. శాంతియుతంగా నిరసన తెలిపేందుకు యత్నిస్తే పోలీసులు అడ్డుకుని సహకరించడం లేదని, బెదిరింపులకు దిగుతున్నారని ఆరోపించారు. చంద్రబాబును బయటకు తీసుకురావాలనేది తమ డిమండ్ అని చెప్పారు. అయితే తమ నిరసనను తెలంగాణ ప్రభుత్వం కూడా అడ్డుకుంటుందని అన్నారు.
ఇక, విప్రో సర్కిల్ వద్దకు పెద్ద ఎత్తున చేరుకున్న ఐటీ ఉద్యోగులకు పోలీసులు చెదరగొట్టారు.