హైదరాబాద్: ఐటీ ఉద్యోగులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన నటుడు బాలకృష్ణపై చర్యలు తీసుకోవాలని ఐటి ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు సందీప్ మక్తాలా సీఈఓ రజత్ కుమార్ కు కోరారు. తెలంగాణ ఐటీ ఉద్యోగులపై నటుడు బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలపై సీఈఓకి పిర్యాదు చేశామని ఆయన చెప్పారు.


చంద్రబాబు వచ్చాకనే ఐటీ ఉద్యోగుల కు స్పెల్లింగ్ నేర్పించడం జరిగిందని బాలకృష్ణ అనడం హాస్యాస్పదమని ఆయన అన్నారు. చంద్రబాబు వల్లనే ఐటీ అభివృద్ధి జరిగిందని అంటూ ఐటీ ఉద్యోగుల మధ్య చిచ్చు పెట్టేందుకు బాలకృష్ణ కుట్ర చేశాడని ఆయన వ్యాఖ్యానించారు. 

బాలకృష్ణ వ్యాఖ్యలపై  తాము చేసిన ఫిర్యాదుకు సీఈఓ కూడా సానుకూలంగా స్పందించారని ఆయన చెప్పారు. మీ ప్రచారం మీరు చేసుకోండి కాని మా ఉద్యోగుల జోలికి రావద్దని ఆయన బాలకృష్ణకు సూచించారు. తమ ఐటీ రంగం ఎవరో చేస్తే అభివృద్ధి చెందలేదని అన్నారు. 

"మీరూ మా ఇండిస్ట్రీ కి ఎం చేశారో మాకు తెలుసు.అన్ని రాష్ట్రాల ప్రజలు ఇక్కడ ఉద్యోగాలు చేస్తారు. అందరి మధ్య విద్వేషాలు రెచ్చగొట్టద్దు" అని ఆయన అన్నారు.