Asianet News TeluguAsianet News Telugu

కొమురవెల్లి మల్లన్న ఆలయానికి షాక్.. రూ.11 కోట్లు ట్యాక్స్ కట్టాలంటూ ఐటీ శాఖ నోటీసులు

రూ.11 కోట్లు పన్ను చెల్లించాలంటూ కొమురవెల్లి మల్లన్న ఆలయానికి కేంద్ర ఆదాయపు పన్ను శాఖ నోటీసులు ఇచ్చింది. రూ.8 కోట్ల ట్యాక్స్ దీనికి రూ.3 కోట్ల జరిమానా మొత్తం రూ.11 కోట్లు చెల్లించాలని ఆదాయపు పన్ను శాఖ పేర్కొంది.

it department issues notice to komuravelli mallanna temple ksp
Author
First Published Oct 5, 2023, 2:32 PM IST

తెలంగాణలోని ప్రముఖ ఆలయం కొమురవెల్లి మల్లన్న ఆలయానికి కేంద్ర ఆదాయపు పన్ను శాఖ నోటీసులు ఇచ్చింది. రూ.11 కోట్లు పన్ను చెల్లించాలంటూ మల్లన్న దేవాలయానికి ఐటీ శాఖ అధికారులు నోటీసులు జారీ చేశారు. ఆదాయపు పన్ను మినహాయింపు కోసం గడువు ముగిసినప్పటికీ 12ఏ రిజిస్ట్రేషన్‌ను ఆలయ అధికారులు పట్టించుకోలేదు. అంతేకాదు.. దాదాపుగా 1995 నుంచి ఐటీ రిటర్న్‌లను ఆదాయపు పన్ను శాఖకు సమర్పించలేదు. 

దీనిపై ఐటీ శాఖ సీరియస్ అయ్యింది. 1995 నుంచి ఐటీ రిటర్న్‌లు, ఆడిట్ వివరాలను సమర్పించాలని నోటీసులు జారీ చేసింది. ఆలయ అధికారుల నిర్లక్ష్యంతోనే ఐటీ నోటీసులు జారీ అయినట్లుగా తెలుస్తోంది. మొత్తం రూ.8 కోట్ల ట్యాక్స్ దీనికి రూ.3 కోట్ల జరిమానా మొత్తం రూ.11 కోట్లు చెల్లించాలని ఆదాయపు పన్ను శాఖ పేర్కొంది. అయితే ఆధ్యాత్మిక కేంద్రాలు, ధార్మిక సంస్థలపై సాధారణ వ్యక్తులు, కంపెనీలతో వ్యవహరించినట్లుగా కఠిన వైఖరిని అవలంబించొద్దని భక్తులు సూచిస్తున్నారు. మరి ఆలయ అధికారులు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాలి. 


 

Follow Us:
Download App:
  • android
  • ios