హైదరాబాద్‌లో దారుణం జరిగింది. ఇస్రోలో సైంటిస్ట్‌ని దుండగులు దారుణంగా హతమార్చారు. ఇస్రో అనుబంధ విభాగమైన రిమోట్ సెన్సింగ్‌లో శాస్త్రవేత్తగా పనిచేస్తున్న సురేశ్ ఇటీవలే ఆయన వాలంటరీ రిటైర్మెంట్‌ తీసుకున్నారు.

సురేశ్‌కు భార్య, కుమారుడు ఉన్నారు... భార్య చెన్నైలో ఉద్యోగం చేస్తుండగా, కుమారుడు అమెరికాలో ఉద్యోగం చేస్తున్నట్లుగా సమాచారం. ఎస్‌ఆర్‌నగర్‌ డీకే రోడ్‌లోని అన్నపూర్ణా అపార్ట్‌మెంట్‌లో నివసిస్తున్న ఆయనను మంగళవారం సాయంత్రం ఓ గుర్తు తెలియని దుండగుడు కత్తితో హత్య చేశాడు. 

సమాచారం అందుకున్న వెస్ట్‌జోన్ డీసీపీ సుమతి సంఘటనాస్థలికి చేరుకుని హత్యకు దారి తీసిన పరిస్థితులను అన్వేషిస్తున్నారు