Asianet News TeluguAsianet News Telugu

దళిత బంధు: ఎన్నికల కోసం దళితులతో రాజకీయమా?: బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు ఫైర్

దళిత బంధు పథకం కేవలం ఎన్నికల స్టంటేనా? దళితుల రాజకీయాలు చేస్తున్నారా? అంటూ బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు  రాష్ట్ర ప్రభుత్వం పై ప్రశ్నలు కురిపించారు. జులైలోనే మొదలవుతుందని ప్రకటించినా.. ఇంకా ప్రారంభం కాలేదని పేర్కొన్నారు.
 

is dalitha bandhu scheme election plank questions bjp mla raghunandan rao to telangana govt kms
Author
First Published Jul 30, 2023, 7:46 PM IST

కేవలం ఎన్నికల స్టంట్ కోసమే దళిత బంధు తెర మీదికి తీసుకువచ్చారా? అంటూ రాష్ట్ర ప్రభుత్వంపై బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు విమర్శలు చేశారు. కేవలం ఎన్నికల కోసం, ఓట్ల కోసమే దళిత బంధు తీసుకువచ్చారా? దళిత బంధు స్కీం ఆధారంగా దళితులతో రాజకీయం చేస్తున్నారా? అంటూ ప్రశ్నలు కురిపించారు. ట్విట్టర్ వేదికగా ఆయన ఓ తెలుగు వార్తా పత్రిక క్లిప్‌ను జత చేసి కేసీఆర్ ప్రభుత్వం ప్రశ్నలు వేశారు.

ఖజానాలో పైసలు లేని కారణంగా దళిత బంధు ఎట్లా అమలు చేసేదేని ప్రభుత్వం ఆలోచిస్తున్నట్టు ఆ కథనం సారాంశంగా ఉన్నది. ఆ కథనం క్లిప్‌ను ట్విట్టర్‌లో పేర్కొంటూ ఖాజానాలో పైసలు లేవా? అని బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు ప్రశ్నించారు. దళిత బంధు కోసం రాష్ట్ర ప్రభుత్వం సందిగ్ధంలో పడిందా? అని పేర్కొన్నారు. జులైలోనే దళిత బంధు పథకం అమలు చేస్తామని కేసీఆర్ ప్రభుత్వం చెప్పిందనీ, ఇప్పటికీ ఇంకా మొదలు పెట్టలేదని ఆయన ట్వీట్ చేశారు.

Also Read: బీజేపీతో బీఆర్ఎస్‌కు పొత్తు.. అందుకే మణిపూర్‌పై కేసీఆర్ మౌనం: కేఏ పాల్

హుజురాబాద్ అసెంబ్లీ ఉప ఎన్నికలకు ముందు కేసీఆర్ ప్రభుత్వం దళిత బంధు పథకాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే. బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్‌తో భీకరంగా పోరాడిన బీఆర్ఎస్ అభ్యర్థి చివరకు ఓటమినే చవిచూశారు. అప్పుడు కూడా దళిత బంధు పథకం కేవలం ఎన్నికల గిమ్మిక్కు అని ఆరోపణలు వచ్చాయి. కానీ, కేసీఆర్ ప్రకటించినట్టుగానే హుజురాబాద్‌లో దళిత బంధు పథకం అమలైంది. రాష్ట్రవ్యాప్తంగా విస్తరిస్తామని చెప్పీ అదే విధంగా చర్యలు చేపట్టారు. విడతల వారీగా దళితులందరికీ ఈ దళిత బంధు ఫలాలు అందుతాయని రాష్ట్ర ప్రభుత్వం చెప్పిన సంగతి తెలిసిందే.

Follow Us:
Download App:
  • android
  • ios