తెలంగాణలో ప్రస్తుతం బోనాల పండుగ అంగరంగ వైభవంగా జరుగుతోంది. ఈ నేపథ్యంలో సోమవారం సుప్రీం స్వేరో ఐపీఎస్ ప్రవీణ్ కుమార్ .. పోలీస్ మెస్ ప్రాంగణంలో ఉన్న ఎల్లమ్మ గుడిని సందర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. 

ఆయనతోపాటు పోలీస్ కానిస్టేబుళ్లు, హోమ్ గార్డ్స్, శానిటరీ సిబ్బంది కూడా అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం ఆయన కానిస్టేబుళ్లు, శానిటరీ సిబ్బందితో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన వారికి పలు సూచనలు చేశారు. ఈ ఆధునిక యుగంలో ఇంగ్లీష్ , కోడింగ్ భాషల ప్రాముఖ్యత వారికి వివరించారు. చదువు మాత్రమే బానిస సంకెళ్లను తెంచుకుతుందని చెప్పారు.