సిద్ధిపేట: మాజీమంత్రి హరీష్ రావుపై ప్రశంసలు కురిపించారు అంతర్జాతీయ టేబుల్ టెన్నీస్ క్రీడాకారిణి నైనా జైస్వాల్. మాజీమంత్రి హరీష్ రావు అద్భుతమైన నాయకుడు అంటూ కొనియాడారు. మాజీమంత్రి హరీష్ రావు నేతృత్వంలో సిద్ధిపేటలోని ఓ ఫంక్షన్ హాల్ లో ఏర్పాటు చేసిన యువ సమ్మేళనం కార్యక్రమానికి నైనా జైస్వాల్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. 
  
నలుగురికి సహాయం చేసే గుణం నీదైతే ఏ గుడికి వెళ్లాల్సిన అవసరం లేదన్న నైనా నువ్వు నమ్మిన దైవం నిన్ను వెతుక్కుంటూ వస్తాడు అంటూ చెప్పుకొచ్చారు. హరీష్ రావు పదిమందికి సహాయం చేసేవారు కాబట్టే వరుణ దేవత కటాక్షం ఆయన వెంట ఉందని చెప్పుకొచ్చారు.

అందుకే మారుమూల పల్లెకు, చిట్టచివరి తాండకు ఓనూతన ఉత్సాహం నాంది పలుకుతుంది. దానికి మూల  కారణం వరుణ దేవత కటాక్షం. హరీష్ రావును దేవులాడుతూ వాన రూపంలో ప్రతీ మారుమూలపల్లె, భూములను సశ్యామలం చేస్తూ అన్నదాతలను సుఖ ప్రదాతలను చేస్తుందని తెలిపారు. 

నేను మాత్రమే బాగుండాలి అనుకోవడం స్వార్థమని నేను కూడా బాగుండాలి అనుకోవడం సహజం అంటూ చెప్పుకొచ్చారు. నాతోపాటు నా వెనుక ఉన్నవారంతా బాగుండాలని కోరుకోవడం అద్భుతమని అలాంటి అద్భుతమైన నాయకుడు హరీష్ రావు అంటూ నైనా ప్రశంసలు కురిపించారు.