మే 12వ తేదీన ఇంటర్నేషనల్ నర్సింగ్ డే వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు హైదరాబాద్ సిద్దమవుతోంది. రవింద్ర భారతి ఆడిటోరియంలో వివిధ నర్సింగ్ ఎంప్లాయిస్ యూనియన్స్ ఆద్వర్యంలో ఈ వేడుకలు జరగనున్నాయి. ఇందుకోసం  ఇప్పటికే ఏర్పాట్లు మొదలయ్యాయి. తెలంగాణ నర్సింగ్ ఆఫీసర్స్, మెడికల్ & హెల్త్ ఎస్సి, ఎస్టీ ఎంప్లాయిస్ అసోసియేషన్, తెలంగాణ గవర్నమెంట్ హాస్పిటల్స్ నర్సెస్ అసోసియేషన్, వెల్ టెక్ ఫౌండేషన్ సంస్థలు ఈ వేడుకలను నిర్వహిస్తోంది. 

అట్టహాసంగా నిర్వహిస్తున్న  ఈ వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ఈ యూనియన్స్ సభ్యులంతా కలిసి తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ ను కోరారు. ప్రజారోగ్యాని కాపాడుతున్న నర్సింగ్ సమాజాన్నిమంత్రి ఈ సందర్భంగా  అభినందించారు. తమ కోరిక మేరకు ముఖ్య అతిథిగా పాల్గొంటానని మంత్రి కూడా హామీ ఇచ్చినట్లు యూనియన్ సభ్యులు తెలిపారు.  

ఈ సందర్భంగా నర్సింగ్ ఆఫీసర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీను  రాథోడ్  మాట్లాడుతూ... ఈ ఆదివారం జరిగే ఇంటర్నేషనల్ నర్సెస్ డే వేడుకలకు పెద్ద సంఖ్యలో నర్సింగ్ ఆఫీసర్స్  హాజరువ్వాలని పిలుపునిచ్చారు. 

నర్సింగ్ ఆఫీసర్స్ అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు లక్ష్మణ్ రూడవత్ మాట్లాడుతూ... ప్రజారోగ్యంలో కీలక పాత్ర పోషిస్తున్న నర్సింగ్ ఆఫీసర్స్ కి ప్రభుత్వం తగిన ప్రోత్సాహం అందించాలన్నారు. నర్సింగ్ ఉద్యోగుల న్యాయమైన హక్కుకోసం పోరాటం సాగిస్తున్న నర్సింగ్ ఆఫీసర్స్ అసోసియేషన్ ను ఆదరిస్తున్న అందరికి ఆయన ధన్యవాదాలు తెలిపారు. 

రాష్ట్రవ్యాప్తంగా ప్రజారోగ్యాన్ని కాపాడుతున్న  అత్యుత్తమ నర్సింగ్ ఆఫీసర్స్  ని గుర్తించి వారికి ఉత్తమ నర్సింగ్ ఆఫీసర్స్ అవార్డులను అందించనున్నట్లు తెలిపారు. ముఖ్యఅతిథి ఆరోగ్య శాఖ మంత్రి చేతులమీదుగా ఈ  అవార్డులను ప్రధానం చేయనున్నట్లు ప్రకటించారు.