Asianet News TeluguAsianet News Telugu

గాంధీభవన్‌లో రచ్చరచ్చ: ఆజాద్ ముందే వీహెచ్-షబ్బీర్ అలీ మాటల యుద్ధం

హైదరాబాద్ గాంధీభవన్‌లో కాంగ్రెస్ సీనియర్ నాయకుల మధ్య వాగ్వాదం జరిగింది. మాజీ కేంద్రమంత్రి గులాంనబీ ఆజాద్ సమక్షంలోనే వీహెచ్-షబ్బీర్ అలీ మధ్య మాటల యుద్ధం జరిగింది.

Internal Clash Between T Congress Leaders vh and shabbir at gandhi bhavan
Author
Hyderabad, First Published Nov 5, 2019, 5:13 PM IST

హైదరాబాద్ గాంధీభవన్‌లో కాంగ్రెస్ సీనియర్ నాయకుల మధ్య వాగ్వాదం జరిగింది. మాజీ కేంద్రమంత్రి గులాంనబీ ఆజాద్ సమక్షంలోనే వీహెచ్-షబ్బీర్ అలీ మధ్య మాటల యుద్ధం జరిగింది.

తాను రిటైర్మెంట్‌కు వచ్చానని షబ్బీర్ అలీ విమర్శిస్తున్నారని వీహెచ్ మండిపడ్డారు. దీంతో ఇద్దరు నేతల మధ్య మాటా మాటా పెరిగి వాగ్వాదానికి దారి తీసింది. కాంగ్రెస్‌లో సీనియర్ నేతలకు అన్యాయం జరుగుతోందని.. ఆర్ఎస్ఎస్ సానుభూతిపరులకు పెద్దపీట వేస్తున్నారంటూ వీహెచ్ ఆరోపించారు. 

ఒరిజినల్ కాంగ్రెస్ నేతలను శవాలంటే ఊరుకునేది లేదని వీహెచ్ వార్నింగ్ ఇచ్చారు. ఇదే సమయంలో వీహెచ్ గురించి మాట్లాడాల్సిన అవసరం తనకు లేదని అలీ వ్యాఖ్యానించారు.

ఆజాద్ జోక్యం చేసుకోవడంతో వివాదం సద్దుమణిగింది. అటు పీసీసీ మార్పుపై పట్టుబట్టారు భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. పీసీసీ చీఫ్ పదవి ఇవ్వకున్నా పార్టీకి కట్టుబడి పనిచేశానని.. ఇప్పుడున్న పరిస్థితుల్లో మరోసారి అవకాశం ఇచ్చినట్లయితే తప్పకుండా పార్టీని అధికారంలోకి తీసుకొస్తానని కోమటిరెడ్డి ధీమా వ్యక్తం చేశారు.

తెలంగాణ పార్టీకి పునర్‌ వైభవాన్ని తీసుకొచ్చేందుకు... సోనియా గాంధీ రుణం తీర్చుకోవడానికి ప్రయత్నిస్తానన్నారు. వరుస ఎన్నికలతో పార్టీ కేడర్ అసంతృప్తిగా ఉందని.. పీసీసీలో మార్పులు చేర్పులు చేయకపోతే మున్సిపల్ ఎన్నికల్లో ఇబ్బందులు తప్పవని మరో నేత సైతం అభిప్రాయపడ్డారు. 

కొద్దిరోజుల క్రితం అధికార టీఆర్ఎస్ పార్టీపైనా, కేసీఆర్ కుటుంబంపైనా ఎప్పుడు నిప్పులు చెరిగే మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆకస్మాత్తుగా స్వరం మార్చారు. ఎన్నడూ లేని విధంగా మంత్రి కేటీఆర్‌పై ఒక్కసారిగా ప్రశంసల వర్షం కురిపించారు.

Also read:టీపీసీసీ చీఫ్: రేవంత్‌కు నో అంటున్న సీనియర్లు, పోటీ పడుతున్నది వీరే

కేటీఆర్ పరిశ్రమల శాఖ మంత్రిగా ఉండటం మన అదృష్టమంటూ ప్రశంసించారు. యాదాద్రి భువనగిరిలో గ్రీన్ ఇండస్ట్రీయల్ పార్కును మంత్రి కేటీఆర్ తో కలిసి కోమటిరెడ్డి ప్రారంభించారు. అనంతరం బహిరంగ సభలో మాట్లాడిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కేటీఆర్ ను ఒక రేంజ్ లో పొగిడేశారు.  

తొలుత మునుగోడు ప్రజల తరపున మంత్రి కేటీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ప్రజలు టీఆర్‌ఎస్‌ను నమ్ముతున్నరు కాబట్టే రెండోసారి అధికారం కట్టబెట్టారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ వస్తే మా బతుకులు బాగుపడ్తయని, మా జీవితాల్లో వెలుగు నింపుతయని ఎంతో ఆశతో కొన్ని లక్షల మంది యువకులు ఎదురుచూస్తున్నారని చెప్పుకొచ్చారు. 

అలాంటి యువకుల కోసం, వారి జీవితాల్లో వెలుగులు నింపేందుకు చేపట్టిన కార్యక్రమమే గ్రీన్ ఇండస్ట్రీయల్ పార్క్ అని చెప్పుకొచ్చారు. పారిశ్రామిక వేత్తలందరినీ ఈ వేదిక ద్వారా ఆహ్వానం పలికారు.  

Also Read:స్వరం మార్చిన కోమటిరెడ్డి: కేటీఆర్ పై పొగడ్తల వర్షం

కేటీఆర్‌లాంటి అనుభవం, అవగాహన ఉన్న వ్యక్తి పరిశ్రమల శాఖ మంత్రి కావడం మన అదృష్టమని రాజగోపాల్‌ రెడ్డి అన్నారు. అంతర్జాతీయ ప్రమాణాలు, అత్యాధునిక మౌలిక వసతులతో గ్రీన్‌ ఇండస్ట్రియల్‌ పార్క్‌లో పరిశ్రమలు పెట్టేందుకు వస్తున్న వారికి కృతజ్ఞతలు తెలిపారు.
 
దండుమల్కాపూర్‌లో టీఎస్‌ఐఐసీ-టీఐఎఫ్-ఎమ్మెస్‌ఎంఈ-గ్రీన్‌ ఇండస్ట్రియల్‌ పార్కు కోసం రైతులు తక్కువ ధరకు భూములిచ్చి పెద్ద మనసు చాటుకున్నారని కొనియాడారు. భూసేకరణ విషయంలో తోడ్పాటునందించిన ప్రతీ ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. 

ఎన్నడూ లేని విధంగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మంత్రి కేటీఆర్ తో వేదిక పంచుకోవడం ఒక ఎత్తైతే...అదే వేదికపై ప్రశంసలు కురిపించడం ఆసక్తికరంగా మారింది. కోమటిరెడ్డి బ్రదర్స్ ఏం మాట్లాడినా సంచలనమే అంటారు. 

 

Follow Us:
Download App:
  • android
  • ios