పరీక్ష రాయడానికని వెళ్లిన ఇంటర్మీడియ యువతి కనిపించకుండా పోయిన ఘటన మెదక్ జిల్లాలో చోటుచేటుసుకుంది. యువతి ఆఛూకీ కోసం ఇటు తల్లిదండ్రులు, అటు పోలీసులు గాలిస్తున్నారు.
మెదక్: పరీక్ష రాసేందుకు వెళ్లిన ఇంటర్మీడియట్ యువతి అదృశ్యం మెదక్ జిల్లాలో కలకలం రేపుతోంది. పరీక్షకు హాజరయిన యువతి ఆ తర్వాతే కనిపించకుండా పోయింది. యువతి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు మిస్సింగ్ కేసు నమోదు చేసుకుని పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ప్రస్తుతం యువతులు, మహిళలు, చిన్నారులపై రోజుకో అఘాయిత్యం వెలుగుచూస్తున్న నేపథ్యంలో అమ్మాయి మిస్సింగ్ ఆందోళన కలిగిస్తోంది.
పోలీసుల కథనం ప్రకారం... మెదక్ జిల్లా చేగుంట మండలం రుక్మాపూర్ గ్రామానికి చెందిన జంపల్లి కళ్యాణి తూప్రాన్ లోని ఓ ప్రైవేట్ కాలేజీలో ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ చదువుతోంది. ప్రస్తుతం ఇంటర్మీడియట్ పరీక్షలు కొనసాగుతున్న నేపథ్యంలో గత మంగళవారం కళ్యాణి పరీక్ష రాయడానికి తూప్రాన్ వెళ్లింది. రుక్మాపూర్ నుండి తండ్రి కుమార్ బైక్ పై చేగుంట వరకు తీసుకెళ్లాడు. అక్కడినుండి బస్ లో యువతి తూప్రాన్ కు చేరుకుంది.
పరీక్షా కేంద్రానికి చేరకున్న కళ్యాణి ఎగ్జామ్ రాసి బయటకు వచ్చింది. అప్పటనుండే ఆమె కనిపించడం లేదు. సాయంత్రమైనా కూతురు ఇంటికి తిరిగిరాకపోవవడంతో కంగారుపడిన తల్లిదండ్రులు ఆమె స్నేహితులు, బంధువులకు ఫోన్ చేసి ఆరా తీసినా యువతి ఆఛూకీ లభించలేదు. చేగుంట, తూప్రాన్ తో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో వెతికినా ఫలితం లేకుండా పోయింది.
రాత్రంతా వెతికినా ఎక్కడా కళ్యాణి జాడ లభించకపోవడంతో బుధవారం తల్లిదండ్రులు తూప్రాన్ పోలీసులకు ఫిర్యాదు చేసారు. దీంతో పోలీసులు వారినుండి యువతికి సంబంధించిన వివరాలను సేకరించి మిస్సింగ్ కేసు నమోదు చేసారు. యువతి ఆచూకీ కోసం ప్రత్యేకంగా గాలింపు చేపట్టామని పోలీసులు తెలిపారు. ఎగ్జామినేషన సెంటర్ తో పాటు పట్టణంలోని వివిధ ప్రాంతాల్లోని సిసి కెమెరాలను పోలీసులు పరిశీలిస్తున్నారు.
ఇటీవల తెలుగురాష్ట్రాల్లో మహిళలపై అఘాయిత్యాలు ఎక్కువగా వెలుగుచూస్తున్నాయి. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం తూప్రాన్ పేటలో ఒంటరిగా వున్న వివాహితపై దారుణంగా అత్యాచారానికి పాల్పడి ఎక్కడ విషయం భయటపెడుతుందోనని హతమార్చాడు ఓ కామాంధుడు.
నాగర్ కర్నూలు జిల్లా కోడూరు మండలంలోని ఓ గిరిజన తండాకు చెందిన మహిళ ఇటీవలే భర్తతో కలిసి ఉపాధినిమిత్తం తూప్రాన్ పేటకు వచ్చింది. హైదరాబాద్ - విజయవాడ హైవే సమీపంలోని ఒక గోదాం వద్ద కాపలా దారులుగా పనికి కుదిరిన భార్యాభర్తలు అక్కడే ఉంటున్నారు. భర్త పగటివేళ సమీపంలోని ఇంజనీరింగ్ కళాశాలలో సెక్యూరిటీ గార్డుగా పని చేస్తున్నాడు. ఈ క్రమంలోనే సోమవారం ఉదయం డ్యూటీకి వెళ్లగా భార్య ఒంటరిగా గోదాం వద్ద వుండటాన్ని గమనించిన దుండుగుడు దారుణానికి ఒడిగట్టాడు.
ఒంటరిగా వున్న వివాహితపై అత్యంత దారుణంగా లైంగిక దాడికి పాల్పడ్డాడు దుండగుడు. మొదటిసారి లైంగికదాడి తర్వాత ఆమె అపస్మారక స్థితిలో అచేతనంగా పడివుంటే మరోసారి అత్యాచారానికి పాల్పడినట్లు తెలుస్తోంది. ఆమె ప్రాణాలు కోల్పోయాక కాళ్ల పట్టీలు, బంగారు పుస్తెలను దోచుకునే పారిపోయాడు.
ఉదయం అతను డ్యూటీ కి వెళ్లి తిరిగి రాత్రి ఇంటికి వచ్చేసరికి ఇంట్లో భార్య కనిపించలేదు. చుట్టుపక్కల వెతకగా సమీపంలోని గడ్డివాము దగ్గర విగతజీవిగా రక్తపుమడుగులో నగ్నంగా పడి ఉంది. ఆయన వెంటనే బావమరిదికి, అత్తమామలకు, పోలీసులకు సమాచారం అందించాడు. రాత్రికి రాత్రే రంగంలోకి దిగిన పోలీసులు డాగ్ స్క్వాడ్, క్లూస్ టీంలను రప్పించి ఆధారాలు సేకరించి చౌటుప్పల్ ప్రభుత్వాసుపత్రిలో శవపరీక్ష నిర్వహించారు. ఆమెపై రెండుసార్లు లైంగిక దాడి జరిగినట్లు నిర్ధారించారు.
