ఇంటర్ విద్యార్థినిపై బ్లేడ్ తో దాడి జరిగింది. అయితే.. అది హత్యాయత్నమా.. లేక ఆత్మహత్యాయత్నమా అన్న విషయంలో క్లారిటీ రాలేదు.ఈ సంఘటన నల్గొండ జిల్లాలో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే..

నల్గొండకి చెందిన తరుణ్ సమీపంలోని పాలిటెక్నిక్ కళాశాలలో చదువుతున్నాడు. మాచర్ల తరుణ్ కుమార్ సోమవారం స్నేహితుడి ఇంటికి వెళుతున్నానని చెప్పి ఇంటికి రాలేదు. దీంతో తల్లిదండ్రులు స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయగా పోలీసులు అదృశ్యం కేసు నమోదుచేసి గాలిస్తున్నారు. 

కాగా... మంగళవారం స్థానిక పాలిటెక్నిక్ కళాశాల సమీపంలో గొంతుపై తీవ్రగాయంతో తరుణ్ కుమార్ ఉండడంతో స్థానికులు గుర్తించి అతడ్ని స్థానిక ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించారు. అయితే.. తరుణ్ తనకు తానే ఆత్మహత్యకు యత్నించాడా లేదా..  ఎవరైనా హత్య చేయడానికి ప్రయత్నించాడా అనే విషయంపై పోలీసులు ఆరా తీస్తున్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.