హైదరాబాద్ హయత్‌నగర్‌లో ఇంటి నుంచి వెళ్లిపోయిన బబ్లీ లారా కథ సుఖాంతమైంది. ఆమె క్షేమంగా ఇంటికి రావడంతో తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు.

తట్టి అన్నారంకు చెందిన బబ్లీ.. తల్లిదండ్రులు మందలించారంటూ అలిగి మూడు రోజుల కిందట ఇంట్లో నుంచి వెళ్లిపోయింది. తల్లిదండ్రులు ఎక్కడ గాలించినా ఆమె ఆచూకీ లభించలేదు.

దీంతో చివరికి హయత్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. మిస్సింగ్ కేసుగా నమోదు చేసిన పోలీసులు ఆమె కోసం గాలించారు. సీసీ కెమెరా ఫుటేజ్ ఆధారంగా యువతి జాడ కనుగొనేందుకు ప్రయత్నించారు.

అయితే ఫోన్ కూడా ఇంట్లోనే వదిలిపెట్టి వెళ్లడంతో కేసు ముందుకు సాగలేదు. చివరికి బబ్లీనే ఇంటికి తిరిగి రావడంతో కేసు సుఖాంతమైంది. మరోవైపు ఈమె గురించి సోషల్ మీడియా, వాట్సాప్, అనేక మంది ప్రచారం చేశారు. లారా ఆచూకీ తెలిస్తే వెంటనే తెలియజేయాల్సిందిగా కోరారు.