గుండెపోటుతో ఇంటర్ విద్యార్థిని మృతిచెందిన సంఘటన సంగారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే... సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని వెలిమల గ్రామంలో నారాయణ జూనియర్ కళాశాలలో ఎంపీటీసీ ద్వితీయ సంవత్సరం చదువుతున్న కీర్తన(17) గురువారం మధ్యాహ్నం స్పృహ తప్పి పడిపోయింది.

దీనిని గమనించిన కళాశాల యాజమాన్యం, తోటి విద్యార్థులు వెంటనే ఆమెను స్థానిక ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూనే కీర్తన కన్నుమూసింది.  కాగా... గుండెపోటు కారణంగానే విద్యార్థి మృతి చెందినట్లు వైద్యులు చెబుతున్నారు. తండ్రి లింగయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ వేణుగోపాల్ రెడ్డి చెప్పారు.