పహాడీ షరీప్ లో లారీ డ్రైవర్ పై కాల్పులు జరిపిన ఘటనకు సంబంధించిన కేసును చేధించినట్టుగా రాచకొండ సీపీ మహేష్ భగవత్ చెప్పారు.  

హైదరాబాద్: లారీలను అపహరిస్తున్న అంతరాష్ట్ర దోపీడీ ముఠాను అరెస్ట్ చేశామని Rachakonda పోలీసులు ప్రకటించారు. హైద్రాబాద్ పహాడీ షరీఫ్ లో లారీ డ్రైవర్ పై కాల్పులు జరిపిన కేసును చేధించినట్టుగా రాచకొండ సీపీ మహేష్ భగవత్ చెప్పారు. 

మంగళవారం నాడు తన కార్యాలయంలో సీపీ Mahesh Bhagwat ఈ కేసుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. ఈ దోపీడికి Haryana కు చెందిన Jamsheed Khan కీలక నిందితుడిగా గుర్తించామన్నారు పోలీసులు. జంషీద్ ఖాన్ జీవనోపాధి కోసం రెండేళ్ల క్రితం Telanganaకు వచ్చినట్టుగా సీపీ భగవత్ చెప్పారు. తెలంగాణలోని ఉమ్మడి నల్గొండ జిల్లాలోని Miryalaguda లోని ఓ పంక్చర్ దుకాణంలో జంషీద్ ఖాన్ పనిచేసినట్టుగా CPవివరించారు.జంషీద్ ఖాన్ ఓ ముఠాను ఏర్పాటు చేసుకొని దోపీడీలకు పాల్పడుతున్నట్టుగా గుర్తించామని మహేష్ భగవత్ తెలిపారు. జంషీద్ ఖాన్ నేతృత్వంలోని ముఠా పహాడీ షరీఫ్ లో Tyre లోడుతో వెళ్తున్న లారీని దోపీడీ చేసిందని సీపీ వివరించారు. లారీ డ్రైవర్ కి Pistol గురిపెట్టి లారీని తీసుకెళ్లారని సీపీ చెప్పారు. అంతేకాదు లారీ డ్రైవర్ ను కాళ్లు , చేతులు కట్టేసి తుక్కుగూడలో వదిలేశారని తెలిపారు. 

లారీని అపహరించిన ప్రదేశంలో ఉన్న CCTV పుటేజీ ఆధారంగా దర్యాప్తు ప్రారంభిస్తే కీలక సమాచారం దొరికిందని సీపీ చెప్పారు. ఈ కేసులో Tamilnadu పోలీసుల నుండి కీలకమైన సమాచారం తమకు లభ్యమైందని ఆయన చెప్పారు. నిందులు హర్యానాకు చెందిన వారుగా తమిళనాడు పోలీసులు తమకు సమాచారం ఇచ్చారని మహేష్ భగవత్ తెలిపారు. ఈ ముఠాలో కీలక సభ్యుడిగా జంషీద్ ఖాన్ గా తాము గుర్తించామన్నారు. అయితే అదే సమయంలో ఖాన్ విమానంలో ఢిల్లీకి పారిపోయినట్టుగా తాము గుర్తించామన్నారు. దీంతో ఢిల్లీ ఎయిర్ పోర్టులో జంషీద్ ఖాన్ ను తాము అరెస్ట్ చేశామని మహేష్ భగవత్ తెలిపారు.

ఈ నెల 17వ తేదీన టైర్ల లారీని ఈ ముఠా దోపీడీ చేసిందని రాచకొండ సీపీ చెప్పారు. తమిళనాడు నుండి వస్తున్న లారీని హరియానా గ్యాంగ్ లిఫ్ట్ పేరుతో ఆపేశారని ఆయన తెలిపారు.లారీ డ్రైవర్ , క్లినర్ ను చేతులు కట్టేసి క్యాబిన్ లో పడేశారని చెప్పారు. లారీ లో ఉన్న 192 MRF టైర్లను గోడౌన్లలో అన్ లోడ్ చేశారని మహేష్ భగవత్ చెప్పారు. 
లారీ ఎక్కగానే డ్రైవర్ పై దాడి చేసి, తుపాకీ తో బెదిరించి లారీ ను కాటేదాన్ కు తీసుకొచ్చారన్నారు. కాటేదాన్ లో ఓ గోదాం లో టైర్లు అన్ని అన్లోడ్ చేశారని పోలీసులు తెలిపారు. 

సీసీ ఫుటేజ్ లో నమోదైన దృశ్యాలతో పాటు టవర్ లోకేషన్, CDR ఆధారంగా నిందితులను అరెస్ట్ చేశామని సీపీ భగవత్ తెలిపారు. జంషెద్ ఖాన్, రహిల్ ఖాన్ ఇద్దరు లారీ ఎక్కి దోపిడీ చేశారని సీపీ చెప్పారు. జంషెద్ ఖాన్ ఒక రౌండ్ కాల్పులు జరిపారని తమ దర్యాప్తులో తేలిందని సీపీ చెప్పారు..తుపాకీ ఉంటే విమానం లో వెళ్లడం కష్టం అని తుపాకీ ని రహిల్ ఖాన్ అప్పగించి విమానం లో వెళ్ళిపోయాడని పోలీసులు చెప్పారు. హైదరాబాద్ కి చెందిన సయ్యద్ బాసిత్ హుసేన్ , కమల్ కబ్రా సహాయం తో లారీని టైర్ల గోదాం కి తరలించారని సీపీ చెప్పారు.ఈ గ్యాంగ్ లో నలుగురిని అరెస్ట్ చేయగా మరో ఇద్దరు పరారీ లో ఉన్నారని సీపీ తెలిపారు. ఈ గ్యాంగ్ జనవరి 18 తేదీన అపోలో టైర్ల తో వెళుతున్న 220 టైర్ల లారీ ని ఇలాగే దోపిడీ చేశారని మహేష్ భగవత్ చెప్పారు.