తెలంగాణలో ఈ నెల 25 నుంచి జరగాల్సిన ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ ఫరీక్షలు మరోసారి వాయిదా పడ్డాయి. ఈ పరీక్షలను జూన్ 7 నుంచి 14 వరకు నిర్వహిస్తామని ఇంటర్ బోర్డ్ ఓ ప్రకటనలో తెలిపింది.

జూన్ 15 నుంచి 18 వరకు ప్రాక్టికల్స్, జూన్ 19న నైతిక, మానవ విలువలు, జూన్ 20న పర్యావరణ విద్య పరీక్ష నిర్వహించనున్నారు. కొద్దిరోజుల క్రితం వెలువడిన ఇంటర్ ఫలితాల్లో తప్పులు దొర్లడంతో తెలుగు రాష్ట్రాల్లో పెను దుమారం రేగింది. పరీక్షలలో ఫెయిల్ అయ్యామనే మనస్తాపంతో 20 మందికి పైగా విద్యార్ధులు బలవన్మరణానికి పాల్పడిన సంగతి తెలిసిందే.