తెలంగాణలో కాంగ్రెస్ అధికారం: ఇద్దరు కీలక పోలీస్ అధికారుల రాజీనామా


ఇంటలిజెన్స్ లో ఓఎస్‌డీగా పనిచేస్తున్న ప్రభాకర్ రావు  సోమవారం నాడు  రాజీనామా చేశారు.

Intelligence OSD  Prabhakar Rao  Resigns lns

హైదరాబాద్: ఇంటలిజెన్స్ లో ఓఎస్‌డీగా  పనిచేస్తున్న ప్రభాకర్ రావు సోమవారంనాడు రాజీనామా చేశారు.మరో వైపు టాస్క్ ఫోర్స్  లో ఓఎస్‌డీ పనిచేస్తున్న  రాధాకిషన్ రావు కూడ రాజీనామా సమర్పించారు.ప్రభాకర్ రావు, రాధాకిషన్ రావుపై  టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి గతంలో పలు ఆరోపణలు చేశారు. కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు తన సామాజిక వర్గానికి చెందిన ఈ ఇద్దరు అధికారులతో కాంగ్రెస్ నేతలపై నిఘా ఏర్పాటు చేశారని ఆరోపించారు. కాంగ్రెస్ నేతల ఫోన్ల ట్యాాపింగ్ తో పాటు  కాంగ్రెస్ నేతల నిఘా పెట్టారని  ఆరోపించారు.  రిటైరైన ఉద్యోగులను  పోలీస్ శాఖలను  ఏర్పాటు చేసుకొని కాంగ్రెస్ పార్టీని  రాజకీయంగా ఇబ్బంది పెట్టేందుకు  కేసీఆర్ ప్రయత్నాలు చేస్తున్నారని  రేవంత్ రెడ్డి ఆరోపణలు చేశారు. 

తెలంగాణలో ఎన్నికల షెడ్యూల్ విడుదలైన తర్వాత కేసీఆర్ సర్కార్ కు అనుకూలంగా పనిచేసే  అధికారుల జాబితాను  కాంగ్రెస్ పార్టీ  ఎన్నికల సంఘానికి  అందించింది. ఈ తరుణంలో కొందరు అధికారులను  ఎన్నికల సంఘం తప్పించింది.ఈ  క్రమంలోనే  టాస్క్ ఫోర్స్ లో ఓఎస్‌డీ పనిచేస్తున్న  రాధాకిషన్ రావును ఎన్నికల సంఘం టాస్క్ ఫోర్స్ నుండి తప్పించింది. 

also read:Transco, genco cmd prabhakar rao:ట్రాన్స్ కో, జెన్ కో సీఎండీ ప్రభాకర్ రావు రాజీనామా

తమ ఫోన్లను కూడ  ఇంటలిజెన్స్ అధికారులు ట్యాపింగ్ చేస్తున్నారని కాంగ్రెస్ నేతలు ఆరో్పించారు.ఫోన్ ట్యాపింగ్ కాకుండా ఫోన్లను హ్యాకింగ్ కూడ చేస్తున్నారని  పోలీసు అధికారులపై  రేవంత్ రెడ్డి ఆరోపించిన విషయం తెలిసిందే.  తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో  కేసీఆర్ సర్కార్ లో కీలకంగా వ్యవహరించిన  ప్రభాకర్ రావు , రాధాకిషన్ రావులు తమ పదవులకు  రాజీనామాలు సమర్పించారు.  ఇంటలిజెన్స్, టాస్క్ ఫోర్స్ లలో రిటైర్డ్ అధికారులను నియమించి  తమను రాజకీయంగా దెబ్బతీసే  ప్రయత్నం చేస్తున్నారని రేవంత్ రెడ్డి ఆరోపించిన విషయం తెలిసిందే.

ఇవాళ ఉదయమే ట్రాన్స్ కో, జెన్ కో సీఎండీ  ప్రభాకర్ రావు తన పదవికి రాజీనామా చేశారు.  రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుగా ఉన్న కేవీ రమణ చారి కూడ తన పదవికి రాజీనామా చేశారు.  ఇవాళ  మధ్యాహ్నం ప్రభాకర్ రావు తన పదవికి రాజీనామా సమర్పించారు.ఇదిలా ఉంటే  పలువురు కార్పోరేషన్ల చైర్మెన్లు కూడ రాజీనామాలు చేశారు.

 రాజీనామా చేసిన కార్పోరేషన్ చైర్మెన్లు

1. సోమ భరత్ కుమార్ 
చైర్మన్, రాష్ట్ర డెయిరీ డేవలప్ మెంట్ కార్పొరేషన్

2. జూలూరి గౌరీ శంకర్ 
చైర్మన్, తెలంగాణ సాహిత్య అకాడమీ

3. పల్లె రవి కుమార్ గౌడ్
చైర్మన్, రాష్ట్ర కల్లుగీత కార్పొరేషన్ 

4. డాక్టర్ ఆంజనేయ గౌడ్
చైర్మన్, స్పోర్ట్స్ అథారిటీ

5. మేడె రాజీవ్ సాగర్ 
చైర్మన్, తెలంగాణ ఫుడ్స్ కార్పోరేషన్

6. డా. దూదిమెట్ల బాలరాజు యాదవ్
చైర్మన్, గొర్రెలు, మేకల అభివృద్ధి సంస్థ.

7. గూడూరు ప్రవీణ్
చైర్మన్, టైక్స్టైల్స్ కార్పొరేషన్.

8. గజ్జెల నగేష్ 
చైర్మన్, బేవరేజెస్ కార్పొరేషన్.

9. అనిల్ కూర్మాచలం
చైర్మన్, ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్.

10.రామచంద్ర నాయక్
చైర్మన్, ట్రైకార్.

11. వలియా నాయక్
చైర్మన్, గిరిజన ఆర్థిక సహకార సంస్థ.

12. వై సతీష్ రెడ్డి
చైర్మన్,

13. డాక్టర్ ఎర్రోళ్ల శ్రీనివాస్ 
చైర్మన్, రాష్ట్ర వైద్య మౌలిక సదుపాయాల కల్పన సంస్థ

14. రవీందర్ సింగ్
చైర్మన్, పౌర సరఫరాల సంస్థ.

15.  జగన్మోహన్ రావు
చైర్మన్, రాష్ట్ర టెక్నాలజికల్ సర్వీసెస్.

 

 

 

  

 


 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios