రేవంత్ ప్రభుత్వానికి ‘లీకుల’ సెగ.. వారికి మూడినట్టేనా?

ప్రతిపక్ష బీఆర్ఎస్ శ్వేతపత్రాల్లోని ప్రతీ అంశానికి కౌంటర్ సిద్ధం చేసింది. శ్వేతపత్రం ఎవరితో తయారుచేయించిన అంశాన్ని కూడా ప్రస్తావించి.. కాంగ్రెస్ ప్రభుత్వం ఖంగు తినేలా చేసింది. 

Information leaks are a big headache for Congress government, What steps are going to be taken by revanth reddy? - bsb

హైదరాబాద్ : తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన పదేళ్ల తరువాత కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. అయితే, కొత్తగా ప్రభుత్వం ఏర్పాటు చేసిన నాటినుంచి నేటివరకు ప్రభుత్వంలో తీసుకుంటున్న ప్రతీ నిర్ణయం.. వేస్తున్న ప్రతీ అడుగు గురించిన సమాచారం.. ప్రతిపక్షాలకు సెకండ్లలో చేరిపోతోందట. ప్రభుత్వంలో ఉంటూ.. ప్రతిపక్షాలకు సమాచారాన్ని చేరవేస్తున్నారు కొందరు. గత ప్రభుత్వంలో పనిచేసి.. ఇప్పుడు కూడా అదే విశ్వాసాన్ని కొనసాగిస్తున్నారట. దీంతో కాంగ్రెస్ ప్రభుత్వానికి ఈ లీకులు పెద్ద తలనొప్పిగా మారాయి. 

డిసెంబర్ 7న ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసి కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన నాటినుంచి నేటి వరకు ప్రతీ అంశం ప్రతిపక్షాలకు చేరిందట. డిసెంబర్ 7న తొలిమంత్రివర్గ సమావేశం కూడా జరిగింది. ఆ సమావేశంలో ముఖ్యమంత్రి, మంత్రులు ఏం మాట్లాడారు? ఏఏ అంశాల మీద చర్చించారు.. అనే సమాచారంతో సహా.. ధరణి, డ్రగ్స్ లాంటి అంశాలపై జరిగిన సమీక్షల్లో ఏం చర్చించారో కూడా స్పష్టంగా ప్రతిపక్షాలకు చేరిపోయిందట.

పాతబస్తే అసలైన హైదరాబాద్.. హైకోర్టును అక్కడి నుంచి తరలించొద్దు - అసదుద్దీన్ ఒవైసీ..

అయితే ఈ విషయం ఎలా బయటకు వచ్చిందంటే.. ప్రభుత్వం ఏర్పడిన తరువాత మొదటిసారి జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో రేవంత్ రెడ్డి ప్రభుత్వం గత ప్రభుత్వం అప్పులు, విద్యుత్ ల మీద శ్వేత పత్రం ప్రవేశ పెట్టింది. శ్వేతపత్రం ప్రవేశ పెడతామని ప్రభుత్వం బాహాటంగానే చెప్పినప్పటికీ.. అందులో ఏఏ అంశాలపై చర్చిస్తారనేది చెప్పలేదు. కానీ ప్రతిపక్ష బీఆర్ఎస్ మాత్రం శ్వేతపత్రంలోని ప్రతీ అంశానికి కౌంటర్ సిద్ధం చేసింది. శ్వేతపత్రం ఎవరితో తయారుచేయించిన అంశాన్ని కూడా ప్రస్తావించి.. కాంగ్రెస్ ప్రభుత్వం ఖంగు తినేలా చేసింది. 

వారి ఎదురుదాడిని విజయవంతంగా తిప్పి కొట్టినప్పటికీ ప్రభుత్వ పెద్దల్లో అనుమానాలు మొదలయ్యాయి. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏం జరుగుతుందో…  శ్వేత పత్రంలో ఏ అంశాలు చర్చించబోతున్నారో.. ముందుగానే  బిఆర్ఎస్ శ్రేణులకు తెలిసిందా?  ప్రభుత్వ నిర్ణయాలు ఏంటి? ? అంతర్గత సమీక్షల్లో ఏం మాట్లాడుకుంటున్నారు? అనే విషయాలన్నీ ముందుగానే ప్రతిపక్షాలకు చేరుతున్నాయని అనుమానాలు తలెత్తాయి.

దీంతో ప్రభుత్వం నష్ట నివారణ చర్యలు చేపట్టాలని డిసైడ్ అయిందట. ప్రభుత్వంలో ఉన్న కొంతమంది అధికారులు ఈ సమాచారాన్ని ప్రతిపక్షాలకు లీక్ చేస్తున్నారని అంచనా వేస్తున్నారు. ఈ లీకు వీరుల వల్లే ప్రభుత్వం ఇబ్బందుల్లో పడిందని, ఇక ముందు ఇలాంటి పరిస్థితి తలెత్తకుండా ఉండేలా తగు జాగ్రత్తలు తీసుకునే దిశగా రేవంత్ ప్రభుత్వం దృష్టి సారించిందని తెలుస్తోంది. 

ఈ క్రమంలోనే నిఘా వర్గాలు రంగంలోకి దిగాయి. ప్రభుత్వంలోని కొంతమంది అధికారులు సమాచారాన్ని లీక్ చేశారని తేల్చాయి. వీరి సమాచారంతోనే ప్రతిపక్షాలు కౌంటర్ సిద్ధం చేసుకున్నాయని తేల్చారు. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి చేరవేశారు. దీన్ని సీరియస్ గా తీసుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయా ప్రభుత్వ శాఖలకు హెచ్చరికలు జారీ చేసినట్లు సమాచారం. అంతర్గత సమీక్షలు, నివేదికల్లో చర్చించిన విశ్వసనీయమైన విషయాలు బయటికి వస్తే  చర్యలు కఠినంగా ఉంటాయని అన్ని ప్రభుత్వ శాఖల హెచ్ఓడీలకు హెచ్చరికలు జారీ చేసినట్లుగా సమాచారం. 

అంతేకాదు గత ప్రభుత్వంతో సన్నిహితంగా ఉండి పనిచేసిన సిబ్బందిపై కూడా నిఘా పెట్టాలని ఆదేశించారట. దీంతోపాటు గత పదేళ్ల బీఆర్ఎస్ హయాంలో మంత్రులు, ఎమ్మెల్యేలకు పీఏలుగా, పీఎస్ లుగా, అడిషనల్ పీఎస్ లుగా, పీఆర్ఓలుగా పనిచేసిన వారూ స్వామి భక్తి ప్రదర్శిస్తున్నారనే అనుమానాలు తల్లెత్తాయి. దీంతో వీరిని తొలగించి, వారి స్థానంలో కొత్త వారిని నియమించాలని తద్వారా లీకులకు వీలైనంత స్థాయిలో అడ్డుకట్ట వేయాలని భావిస్తోందట. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios