Asianet News TeluguAsianet News Telugu

హైదరాబాదీలకు షాక్.. కొండెక్కిన ఇరానీ ఛాయ్ ధర, కప్పు ఎంతంటే..?

నిత్యావసర ధరలు, ఇతర ఖర్చులు పెరగడంతో హైదరాబాద్‌లో ఇరానీ ఛాయ్ ధర కూడా పెరిగింది. నగరంలోని కొన్ని ప్రాంతాల్లో కప్పు ఇరానీ ఛాయ్ రూ.20కి విక్రయిస్తున్నారు. 

Inflation pushes up cost of Irani chai to Rs 20 in hyderabad
Author
First Published Dec 9, 2022, 2:38 PM IST

ఆర్ధిక మాంద్యం, ద్రవ్యోల్బణం పరిణామాలతో ప్రపంచ ఆర్ధిక వ్యవస్థలు చివురుటాకులా వణికిపోతున్న సంగతి తెలిసిందే. పేరున్న సంస్థలన్నీ ఖర్చులను తగ్గించేందుకు గాను పెద్ద ఎత్తున ఉద్యోగులను తొలగిస్తున్నాయి. దీంతో ఏ క్షణంలో ఎవరి ఉద్యోగం ఊడుతుందోనని బిక్కుబిక్కుమంటున్నారు వేతన జీవులు. అయితే మాంద్యం , ద్రవ్యోల్బణం కారణంగా నిత్యావసరాలు, ఇతర వస్తువుల ధరలు భారీగా పెరుగుతున్నాయి. 

దీనిలో భాగంగా హైదరాబాదీల ఫేవరేట్ ఇరానీ ఛాయ్ ధర కూడా పెరిగింది. తినడానికి చేతిలో చిల్లిగవ్వ లేకపోయినా చిన్న టీతో కడుపు నింపుకునేవారెందరో. ఇరానీ ఛాయ్‌లో ఉస్మానియా బిస్కెట్ ముంచుకుని తింటే ఆ టేస్టే వేరు. కాలం మారినా, ఎన్ని రుచులు అందుబాటులోకి వచ్చినా హైదరాబాదీల ఓటు ఇరానీ ఛాయ్‌కే. అలాంటిది దీని ధర ద్రవ్యోల్బణం కారణంగా రూ.20కి చేరుకుంది. 

దీనికి అనేకా కారణాలు వున్నాయంటున్నారు ఇరానీ ఛాయ్ దుకాణదారులు. పాలు, తేయాకు, పంచదార, గ్యాస్ తదితర ఖర్చులు పెరగడంతో గత్యంతరం లేక ఇరానీ ఛాయ్ ధరను కూడా పెంచామని వారు చెబుతున్నారు. అయితే కొన్ని ప్రాంతాల్లో మాత్రం రూ.15కే ఇంకా ఇరానీ ఛాయ్ దొరుకుతోంది. కానీ దీనిని సేవించకపోతే పిచ్చెక్కిపోయేవారు మాత్రం ఎంత రేటైనా సరే వెనుకాడటం లేదు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios