జూబ్లీహిల్స్ అసెంబ్లీ సెగ్మెంట్ నుండి సిట్టింగ్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ కు కాకుండా  తెలంగాణ ఉద్యమకారులకు టికెట్టు కేటాయించాలని  తెలంగాణ ఉద్యమ కారుడు  ఇంద్రసేన తన ఇంట్లోనే  నిరసనకు దిగాడు.


హైదరాబాద్: జూబ్లీహిల్స్ అసెంబ్లీ సెగ్మెంట్ నుండి సిట్టింగ్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ కు కాకుండా తెలంగాణ ఉద్యమకారులకు టికెట్టు కేటాయించాలని తెలంగాణ ఉద్యమ కారుడు ఇంద్రసేన తన ఇంట్లోనే నిరసనకు దిగాడు.

ఇంట్లోనే తలుపులు బిగించుకొని శనివారం నాడు నిరసనకు దిగాడు. మాగంటి గోపినాథ్‌కు బదులుగా మరోకరికి సీటును ఇవ్వాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే ఎన్నికల ప్రచారంలో మాగంటి గోపినాథ్ శనివారం నాడుమహిళల నుండి నిరసన వ్యక్తం చేశారు.

ఓట్ల కోసం వచ్చిన మాగంటి గోపినాథ్‌ను నాలుగేళ్లపాటు ఏం చేశావని ప్రశ్నించారు. ఓట్ల సమయంలోనే గుర్తుకు వచ్చామా అంటూ నిలదీశారు. దీంతో ప్రచారాన్ని మాగంటి గోపినాథ్ అర్ధాంతరంగా ముగించుకొని వెళ్లిపోయాడు.