హైదరాబాద్: హైద్రాబాద్ శంషాబాద్ విమానాశ్రయంలో పెద్ద ప్రమాదం తప్పింది. ఇండిగో  విమానం ల్యాండింగ్ సమయంలో టైర్ల నుండి పొగలు వెలువడ్డాయి.సకాలంలో అధికారులు అప్రమత్తం కావడంతో ప్రమాదం తప్పింది.

ఢిల్లీ నుండి ఇండిగో విమానం హైద్రాబాద్ శంషాబాద్ విమానాశ్రయంలో మంగళవారం నాడు ల్యాండ్ అయ్యే సమయంలో  ఈ ఘటన చోటు చేసుకొంది.

విమానం ల్యాండ్ అయ్యే సమయంలో విమానం టైర్ల నుండి పొగలు వచ్చాయి. ఈ విషయాన్ని గమనించిన ఎయిర్‌పోర్ట్ అధికారులు స్పందించారు. ఆ సమయంలో విమానంలో 155 మంది ప్రయాణీకులు ఉన్నారు. మంటలు వ్యాపించకుండా ఎయిర్ పోర్టు అధికారులు చర్యలు తీసుకొన్నారు.