వరంగల్: అమెరికాలోని మిచిగాన్‌లో  సాయికృష్ణ అనే తెలుగువాడిపై  గుర్తు తెలియని  వ్యక్తులు కాల్పులకు పాల్పడ్డారు. చావు బతుకుల మధ్య సాయికృష్ణ కొట్టుమిట్టాడుతున్నారు.

ఉమ్మడి వరంగల్ జిల్లాలోని మహబూబాబాద్ ‌కు చెందిన సాయికృష్ణ ఎలక్ట్రికల్ ఇంజనీర్ గా పనిచేస్తున్నారు. ప్రస్తుతం డెట్రాయిట్‌లోని ఆసుపత్రిలో చావు బతుకుల మధ్య పోరాడుతున్నారు. మిచిగాన్‌లోని లారెన్స్ టెక్ యూనివర్శిటీ నుండి సాయి కృష్ణ ఇంజనీరింగ్ పూర్తి చేశాడు. సాయికృష్ణ తన భవిష్యత్తు కోసం విదేశాలకు వెళ్లాలని భావిస్తున్నాడు.

అదే సమయంలో  డెట్రాయిట్ లో తాను పనిచేసే సంస్థలో విధులు ముగించుకొని తిరిగి వస్తుండగా  ఈ ఘటన చోటు చేసుకొంది.దొంగలు సాయికృష్ణను నిలిపివేసి  అతడిని కారులో నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి దోపీడికి పాల్పడ్డారని సాయికృష్ణ స్నేహితులు చెబుతున్నారు.