Asianet News TeluguAsianet News Telugu

కరోనా రోగుల సేవలకు సంఘీభావం: గాంధీ ఆసుపత్రి వద్ద ఇండియన్ ఆర్మీ పూల వర్షం

కరోనా రోగులకు చికిత్స అందిస్తున్న  గాంధీ ఆసుపత్రిలోని వైద్యులు, పారిశుద్య సిబ్బంది, నర్సులపై భారత వాయుసేన ఆదివారం నాడు పూల వర్షం కురిపించింది.

Indian army Chopper Showers Flower Petals on Gandhi Medical College
Author
Hyderabad, First Published May 3, 2020, 10:40 AM IST

హైదరాబాద్:కరోనా రోగులకు చికిత్స అందిస్తున్న  గాంధీ ఆసుపత్రిలోని వైద్యులు, పారిశుద్య సిబ్బంది, నర్సులపై భారత వాయుసేన ఆదివారం నాడు పూల వర్షం కురిపించింది.

కరోనా రోగులకు సేవలు అందిస్తున్న వైద్యులు, పారిశుద్య సిబ్బంది, పారామెడికల్ సిబ్బంది, పాత్రికేయులకు సంఘీభావంగా గగనతలం నుండి పూల వర్షం కురిపించాలని త్రివిధ దళాలు నిర్ణయం తీసుకొన్నాయి. ఇందులో భాగంగానే దేశంలోని పలు ఆసుపత్రులపై భారత వైమానిక దళానికి చెందిన విమానాలు ఆదివారం నాడు ఉదయం పూల వర్షం కురిపించి తమ సంఘీభావాన్ని తెలిపాయి.

హైద్రాబాద్ లో  గాంధీ ఆసుపత్రిలో కరోనా రోగులకు సేవలు నిర్వహిస్తున్నారు. గాంధీ ఆసుపత్రిలో ప్రస్తుతం 522 మంది రోగులు చికిత్స పొందుతున్నారు. ఇవాళ ఉదయం పదిన్నర గంటలకు గాంధీ ఆసుపత్రి ఆవరణలో ఉన్న గాంధీ, జయశంకర్ విగ్రహాల మధ్య సోషల్ డిస్టెన్స్ లో వైద్యులు, నర్సులు, పారిశుద్య సిబ్బంది నిల్చున్నారు. హైద్రాబాద్ సీపీ అంజనీకుమార్ కూడ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

త్రివిధ దళాల అధికారులు గాంధీ ఆసుపత్రి సూపరింటెండ్ కు పుష్పగుచ్ఛాలుంచి శుభాకాంక్షలు తెలిపారు. హాకీంపేట నుండి ప్రత్యేక హెలికాప్టర్ల ద్వారా  వైద్య సిబ్బందిపై పూల వర్షం కురిపించి తమ సంఘీభావం తెలిపారు.

Follow Us:
Download App:
  • android
  • ios