Asianet News TeluguAsianet News Telugu

జింఖానా గ్రౌండ్‌లో టికెట్ల విక్రయాలు నిలిపివేత.. క్యూలైన్లను ఖాళీ చేయిస్తోన్న పోలీసులు

ఈ నెల 25న జరగనున్న భారత్ - ఆస్ట్రేలియా మ్యాచ్‌కు సంబంధించి జింఖానా గ్రౌండ్‌లో టికెట్ల విక్రయాలను హెచ్‌సీఏ నిలిపివేసింది. దీంతో క్యూలో నిలబడ్డ అభిమానులను పోలీసులు వెనక్కి పంపుతున్నారు. 

india australia match ticket sales stopped at gymkhana ground
Author
First Published Sep 22, 2022, 4:00 PM IST

ఈ నెల 25న జరగనున్న భారత్ - ఆస్ట్రేలియా మ్యాచ్‌కు సంబంధించి జింఖానా గ్రౌండ్‌లో టికెట్ల విక్రయాలను హెచ్‌సీఏ నిలిపివేసింది. టికెట్లు అయిపోయాయని అధికారులు ప్రకటించడంతో క్యూలో నిలబడ్డ అభిమానులను పోలీసులు వెనక్కి పంపుతున్నారు. మరోవైపు.. హెచ్‌సీఏ, అధికారులు, పోలీసుల మధ్య సమావేశం వాడి వేడిగా జరుగుతున్నట్లుగా తెలుస్తోంది. 

అంతకుముందు జింఖానా గ్రౌండ్ర్స్ లో తొక్కిసలాట ఘటనకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకొంటామని తెలంగాణ మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ హెచ్చరించారు. గురువారం నాడు హైద్రాబాద్ లో మంత్రి మీడియాతో మాట్లాడారు. జింఖానా గ్రౌండ్స్ వద్ద తొక్కిసలాట ఘటనపై కేసులు నమోదు చేస్తామన్నారు. భారత్, అస్ట్రేలియా క్రికెట్ మ్యాచ్‌కు సంబంధించిన టికెట్ల విక్రయాల బాధ్యత హెచ్‌సీఏదేనని మంత్  చెప్పారు. ఈ విషయమై తమను అడిగితే ఏర్పాట్లకు సహకరించే వాళ్లమన్నారు. తెలంగాణ ప్రతిస్టను ఎవరూ దెబ్బతీసినా ఊరుకునేది లేదని శ్రీనివాస్ గౌడ్ స్పష్టం చేశారు. 

ALso REad:జింఖానా గ్రౌండ్స్ లో తొక్కిసలాటకు బాధ్యులపై చర్యలు: మంత్రి శ్రీనివాస్ గౌడ్ వార్నింగ్

కాగా.. ఈ నెల 25న ఉప్పల్ స్టేడియంలో  ఇండియా, అస్ట్రేలియా క్రికెట్ మ్యాచ్  ఉంది. ఈ మ్యాచ్ టికెట్ల విషయమై క్రికెట్ అభిమానులు వారం రోజులుగా హెచ్ సీ ఏ, జింఖానా గ్రౌండ్ల చుట్టూ తిరుగుతున్నారు. టికెట్ల విక్రయంలో గోల్ మాల్ చోటు చేసుకుందనే ఆరోపణలు వెల్లువెత్తాయి. ఆఫ్ లైన్ లో టికెట్ల విక్రయం కోసం క్రికెట్ అభిమానులు ఆందోళనలు చేశారు. దీంతో ఇవాళ జింఖానా గ్రౌండ్స్ లో టికెట్ల విక్రయం చేస్తామని హెచ్ సీ ఏ ప్రకటించింది.  అయితే టికెట్ల విక్రయానికి సంబంధించి సరైన ఏర్పాట్లు చేయలేదు. పెద్ద ఎత్తున క్రికెట్ అభిమానులు జింఖానా గ్రౌండ్ వద్దకు తరలి వచ్చారు.  టికెట్ కౌంటర్ ప్రారంభించిన గంటన్నర తర్వాత కూడా ఒక్క టికెట్ కూడా విక్రయించలేదు.  అదే సమయంలో  వర్షం రావడంతో గేటు వైపునకు పెద్ద ఎత్తున క్యూ లైన్లలో ఉన్నవారు వచ్చారు. వీరిని అదుపు చేసేందుకు పోలీసులు లాఠీ చార్జీ చేశారు. ఈ సమయంలో తొక్కిసలాట చోటు చేసుకుంది. ఈ ఘటనలో పలువురు గాయపడగా ఓ యువతి పరిస్థితి విషమంగా ఉంది.
 

Follow Us:
Download App:
  • android
  • ios